ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KCR: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే.. సీఎం రేవంత్‌పై కేసీఆర్ ఆగ్రహం

ABN, Publish Date - Apr 05 , 2024 | 06:34 PM

నాలుగైదు నెలల్లోనే కరీంనగర్ ఏడారి అయ్యిందని బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు. ‘పొలంబాట’లో భాగంగా శుక్రవారం నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. సాగునీరందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. అన్నదాతలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

రాజన్న సిరిసిల్ల: నాలుగైదు నెలల్లోనే కరీంనగర్ ఏడారి అయ్యిందని బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు. ‘పొలంబాట’లో భాగంగా శుక్రవారం నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. సాగునీరందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. అన్నదాతలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Kishan Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు..


రాజ్యంలో ఉన్నది అసమర్థులు, చవట దద్దమ్మలని విమర్శించారు. కేసీఆర్ ప్రసంగం మధ్యలో గులాబీ నేతలు, కేసీఆర్ అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. గులాబీ నేతలను వారించారు. రైతుబంధు ఇవ్వకుండా రైతులను అగమాగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహాలక్ష్మి లేదు.. మన్ను లక్ష్మి లేదు అంతా మోసమని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం తప్పిదాల వల్ల 209 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన రైతులకు రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.


ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇక నీ డ్రామాలు నడవవని హెచ్చరించారు. కేఆర్ఎంబీ అధికారులు ఏమైనా తమకు బాసులా అని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి నేనా.. నువ్వా.. నేను వెళ్లగానే..మోటార్లు ఆన్ చేశారు’ అని చెప్పారు. రూ. 2 లక్షల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. డిసెంబర్ 9వ తేదీన మాఫీపై చేసిన సంతకం ఏమైందని నిలదీశారు.


గోదావరి నదీ మీద నిర్మించిన ప్రాజెక్టులు సజీవ జల ధారులు అని చెప్పారు. మిడ్ మానేరు బ్రిడ్జి సముద్రం లాగా ఉండేదని.. ప్రస్తుత ప్రభుత్వ తెలివి తక్కువ తనంతో ఇప్పుడు ఎండిపోయిందని అన్నారు. 2014 కన్నా ముందు ఉన్న తెలంగాణ ఇప్పుడు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో పంటలు ఎండని జిల్లానే లేదని మండిపడ్డారు.


ఇందిరమ్మ రాజ్యంలో ఇగిలించిన తెలంగాణ అయ్యిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో లత్కోర్‌లు రాజ్యం ఏలుతున్నారని ధ్వజమెత్తారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువేనని అన్నారు. కిరికిరి మాటలు చెప్పి తప్పించుకోవద్దని అన్నారు. 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.


మంత్రి కోమటిరెడ్డిని జైళ్లో పెట్టెవాళ్లం...

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి‌పై కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనను తన ప్రభుత్వంలో జైల్లో పెట్టాలనుకుంటే పెట్టేవాళ్లమని హెచ్చరించారు. మిడ్ మానేరు కట్ట కొట్టుకుపోవడానికి కోమటిరెడ్డి కంపెనీయే కారణం కాదా అని ప్రశ్నించారు. ఇవాళ ఆ మంత్రి అడ్డం పొడవు మాట్లాడుతున్నారని కేసీఆర్ విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి

Danam Nagender: ఐపీఎల్ టికెట్ల అమ్మకంపై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు

Shanti Swaroop: మూగబోయిన తొలి తెలుగు న్యూస్ రీడర్ స్వరం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 05 , 2024 | 07:03 PM

Advertising
Advertising