ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KCR: అసెంబ్లీకి కేసీఆర్‌!

ABN, Publish Date - Jul 23 , 2024 | 03:20 AM

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకైనా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరవుతారా!? గత సమావేశాల తరహాలో దూరంగా ఉంటారా!? రాజకీయ వర్గాలను వేధిస్తున్న ప్రశ్న ఇది! అయితే, ప్రతిపక్ష నేత హోదాలో ఈసారి సమావేశాలకు కేసీఆర్‌ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

  • ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి హాజరు..

  • ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరంపై స్పష్టత ఇవ్వనున్న మాజీ సీఎం

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకైనా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరవుతారా!? గత సమావేశాల తరహాలో దూరంగా ఉంటారా!? రాజకీయ వర్గాలను వేధిస్తున్న ప్రశ్న ఇది! అయితే, ప్రతిపక్ష నేత హోదాలో ఈసారి సమావేశాలకు కేసీఆర్‌ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. గత పదేళ్లపాటు సభాధ్యక్షుడి హోదాలో హాజరైన కేసీఆర్‌.. ప్రతిపక్ష నేత హోదాలో హాజరు కావడం ఇదే తొలిసారి కానుంది. అంతేనా.. నిరుద్యోగుల సమస్యలు, ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆయన సిద్ధమైనట్లు సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సభ కొనసాగినన్ని రోజులు ఆయన వస్తారా..? కేవలం బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు, మరికొన్ని రోజులు మాత్రమే పాల్గొంటారా?


అన్న దానిపై స్పష్టత లేదు. కాగా.. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో సభలో అధికార కాంగ్రె్‌సను ప్రశ్నించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. ప్రధానంగా రుణమాఫీకి ఆంక్షలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల, ఇటీవలి అరెస్టులు తదితరాలను ప్రస్తావించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు తదితరాలపై విమర్శలతోపాటు ఆరు గ్యారంటీల అమలుకు సభలో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేయనుంది. రైతు భరోసా చెల్లింపులో జాప్యం, పంటలకు మద్దతు ధర, బోనస్‌ చెల్లింపు, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను సభ దృష్టికి తీసుకెళ్లనుంది. సమావేశాల్లో పార్టీ వైఖరి, సభలో ఏయే సమస్యలను లేవనెత్తాలన్న దానిపై మంగళవారం బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు.

Updated Date - Jul 23 , 2024 | 03:20 AM

Advertising
Advertising
<