ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్పారంటే..

ABN, Publish Date - Dec 02 , 2024 | 09:14 PM

సంక్రాంతి తరువాత రైతు భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనెల 5న ఇందిరమ్మఇళ్లకు సంబంధించిన యాప్ ఒపెన్ చేస్తున్నామని అన్నారు. ప్రతి గ్రామానికి బృందాలు వస్తాయని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

ఖమ్మం జిల్లా: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అన్నీ అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ(సోమవారం) మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. గత సంవత్సరం డిసెంబర్ మూడోతేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయని ప్రజల దీవెనలతో మంత్రిని అయ్యానని గుర్తుచేశారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఆతర్వాత అందరూ ఒక్కటేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.


ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు నమ్మరని అన్నారు. రైతును రాజును చేయాలని అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టారని ఉద్ఘాటించారు. రూ. 2800 కోట్లు రైతు రుణమాఫీకి విడుదల చేశామన్నారు. రూ. 21 వేల కోట్లు రుణమాఫీ చేశామని చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రూ. 250లు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమని..ఈనాడు రూ.500 బోనస్ ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.


సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని తెలిపారు. ఈనెల 5న ఇందిరమ్మఇళ్లకు సంబంధించిన యాప్ ఒపెన్ చేస్తున్నామని అన్నారు. ప్రతి గ్రామానికి బృందాలు వస్తాయని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లు ఇస్తామని చెప్పారు. గడిచిన పదేళ్లలో పాలించిన కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టిందని మండిపడ్డారు. రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇళ్లు లేని వారు ఉండరని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Updated Date - Dec 02 , 2024 | 09:16 PM