ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Investigation: కర్త, కర్మ, క్రియ.. కేటీఆరే!

ABN, Publish Date - Dec 26 , 2024 | 03:26 AM

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కేటీఆర్‌కు ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చిన ఐఏఎస్‌ అధికారి దానకిశోర్‌ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేశారు.

  • ఆయన ఆదేశాలతోనే నిధుల మళ్లింపు

  • సీనియర్‌ ఐఏఎస్‌ దానకిశోర్‌ వాంగ్మూలం!

  • ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం

  • నాలుగు గంటల పాటు ప్రశ్నించిన ఏసీబీ

  • పలు అంశాలకు సంబంధించి ఆధారాల సేకరణ

  • అరెస్టు వద్దంటూ ప్రభుత్వానికి అర్వింద్‌ వినతులు

  • అప్రూవర్‌గా మార్చుకునే యోచనలో ఏసీబీ

  • ఆయన విచారణ తర్వాత కేటీఆర్‌కు నోటీసులు

  • కోర్టు తదుపరి ఉత్తర్వుల అనంతరమే?

హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కేటీఆర్‌కు ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చిన ఐఏఎస్‌ అధికారి దానకిశోర్‌ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. ఏసీబీకి చెందిన సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ (సీఐయూ) బృందం దానకిశోర్‌ నుంచి కీలక ఆధారాలు సేకరించింది. రేసుకు సంబంధించి నాటి ప్రభుత్వానికి, బ్రిటన్‌కు చెందిన ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈవో) సంస్థకు మధ్య జరిగిన ఒప్పందాలు, ఇన్‌వాయి్‌సలు, 2023 సెప్టెంబరు 27న నాటి పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి అర్విందకుమార్‌ నాటి మంత్రి కేటీఆర్‌కు పంపిన ఫైల్‌ ప్రతులను ఏసీబీ అధికారులు తీసుకున్నారు. దానకిశోర్‌ ఫిర్యాదులో పేర్కొన్న ప్రతి అంశానికి సంబంధించిన ఆధారాలనూ సేకరించారు.


మంగళవారం సాయంత్రం దాదాపు నాలుగు గ ంటల పాటు దానకిశోర్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతం తమకు అందుబాటులో ఉన్న ఫైళ్ల ప్రకారం నిధుల మళ్లింపు అంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని.. దీనికి కర్త, కర్మ, క్రియ అంతా నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆరేనని దానకిషోర్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. నోట్‌ ఫైల్‌ తర్వాత ఒప్పందం జరగడానికి నెలపైగానే సమయం పడితే, అంతకుముందే నిధులు విడుదల చేయడం పూర్తిగా నిబంధనల ఉల్లంఘనేనని, అనుమానాస్పద వ్యవహారమని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎఫ్‌ఈవోకు, పురపాలక శాఖకు మధ్య గత ఏడాది అక్టోబరు 30న ఒప్పందం జరగ్గా.. అక్టోబరు3, 11వ తేదీల్లోనే ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు నుంచి రూ.46 కోట్లను ఎఫ్‌ఈవోకు పంపడంపై ఏసీబీ అధికారులు స్పష్టత తీసుకున్నట్లు సమాచారం.


సీఎ్‌సను పరిగణనలోకి తీసుకోకుండానే..

ఏ శాఖకు సంబంధించి అయినా నాన్‌ బడ్జెట్‌ నిధులు వాడాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇచ్చి ఫైళ్లను ఆర్థిక శాఖకు పంపాల్సి ఉంటుందని, సీఎం లేదా సంబంధిత మంత్రి ఆమోదిస్తేనే ఇది సాధ్యం అవుతుందని, కేటీఆర్‌ ఆదేశాల మేరకే తాను నిధులను పంపానని అర్విందకుమార్‌ అంగీకరించిన విషయాన్ని దానకిశోర్‌ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. అర్విందకుమార్‌ అప్పట్లో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండడంతో సీఎ్‌సని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఫైళ్లను నడిపించారని తెలుస్తోంది. గత ఏడాది జనవరిలో శాంతికుమారి సీఎ్‌సగా నియమితులైనప్పటికీ పురపాలకశాఖ ఫైళ్లు ఆమె వద్దకు రాకుండానే పరుగులు తీసేవని సమాచారం. ఈ క్రమంలో అర్విందకుమార్‌ను విచారించిన తర్వాతే కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


ఒకటిరెండు రోజుల్లో అర్విందకుమార్‌కు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే హైకోర్టు కేటీఆర్‌కు ఇచ్చిన గడువు ఈ నెల 30నముగుస్తుండడంతో ఆ తర్వాతే నోటీసులకు వెళ్లాలా? అని కూడా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ కేసు నుంచి తనను బయటపడేయాలని, అరెస్టు వరకు వెళ్లకుండా చూడాలని అర్విందకుమార్‌ ప్రభుత్వానికి సందేశాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను అప్రూవర్‌గా మార్చుకొని దర్యాప్తులో ముందుకు వెళ్లే యోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. హైకోర్టు గడువు కొద్ది రోజులే ఉన్న క్రమంలో కేటీఆర్‌కు ముందే నోటీసులు ఇవ్వడం వల్ల ఎక్కువ ప్రచారం వచ్చే అవకాశం ఉంటుందని, కోర్టు తదుపరి ఉత్తర్వుల వరకు ఆగి, ముందుకు వెళ్లడం మంచిదని రాజకీయ వర్గాలు ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది.

Updated Date - Dec 26 , 2024 | 03:26 AM