ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..

ABN, Publish Date - Nov 17 , 2024 | 08:01 PM

ఖమ్మం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేస్తుండగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పోలీసులకు అనుమానం వచ్చింది. వారిని ఆపి ప్రశ్నించే లోపే పోలీసులను చూసి ఇద్దరూ పారిపోయే ప్రయత్నం చేశారు.

Khammam Police Commissioner Sunil Dutt

ఖమ్మం: గ్రానైజ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించేందుకు తుపాకులతో వెళ్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. నిందితులు వ్యాపారులను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన వెల్లడించారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. విచారణలో సంచలన విషయాలు గుర్తించినట్లు కమిషనర్ తెలిపారు.


ఖమ్మం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేస్తుండగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పోలీసులకు అనుమానం వచ్చింది. వారిని ఆపి ప్రశ్నించే లోపే పోలీసులను చూసి ఇద్దరూ పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించిన పోలీసులు నిందితులిద్దరినీ పట్టుకున్నారు. అనంతరం వారిని తనిఖీ చేయగా దొరికిన మారణాయుధాలు చూసి కంగుతిన్నారు. వారి వద్ద నుంచి మూడు తుపాకులు, నాలుగు మ్యాగ్జిన్లు, 17 బుల్లెట్లు, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.


అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులిద్దరినీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొహమ్మద్ అఫ్సర్, వేంకటేశ్వర్లుగా గుర్తించినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. మహమ్మద్ రియాజ్ అనే వ్యక్తి తుపాకీ కావాలని వీరిని సంప్రదించాడని, అతనికి ఆ తుపాకీని అందజేసేందుకు వెళ్తుండగా పట్టుపడ్డారని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం రియాజ్ పరారీలో ఉన్నాడని వెల్లడించారు.


వీరంతా కలిసి ముదిగొండ గ్రానైట్ ఫ్యాక్టరీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులను భయపెట్టి డబ్బులు వసూలు చేసేందుకు ప్లాన్ చేశారని కమిషనర్ తెలిపారు. మహబూబాబాద్, గార్ల, మరిపెడ, కె.సముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు సునీల్ దత్ వెల్లడించారు. ఆయా పోలీస్ స్టేషన్లలో మొహమ్మద్ అఫ్సర్‌పై మూడు కేసులు ఉండగా.. వేంకటేశ్వర్లుపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం వీరిపై మరో కేసు నమోదు అయినట్లు కమిషనర్ వెల్లడించారు. ఎవరి నుంచైనా వ్యాపారులకు బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

KTR: ఆ విషయంలో ఏఐసీసీపై కేటీఆర్ ఫైర్.. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన కేటీఆర్..

Minister Raja Narasimha: ఖమ్మం ర్యాగింగ్ ఘటనపై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం..

Konda Surekha: ఫోన్ ట్యాపింగ్‌పై షాకింగ్ విషయాలు బయటపెట్టిన మంత్రి కొండా సురేఖ

Updated Date - Nov 17 , 2024 | 08:13 PM