ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ponguleti: వాళ్లు చేసి.. మమ్మల్ని అంటున్నారు.. నీటి కొరతపై మంత్రి పొంగులేటి ఫైర్

ABN, Publish Date - Apr 08 , 2024 | 12:15 PM

Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం వైరా నియోజకవర్గ కేంద్రంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్నదని.. ఆ పరిస్థితుల్లో నీటిని మొత్తం వేస్ట్‌గా దిగువ ప్రాంతాలకు వదిలారన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే నీటి కొరత ఏర్పడిందని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

Minister Ponguleti Srinivas Reddy

ఖమ్మం జిల్లా, ఏప్రిల్ 8: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రైతు సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. సోమవారం వైరా నియోజకవర్గ కేంద్రంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ (BRS Chief KCR) నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) దెబ్బతిన్నదని.. ఆ పరిస్థితుల్లో నీటిని మొత్తం వేస్ట్‌గా దిగువ ప్రాంతాలకు వదిలారన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే నీటి కొరత ఏర్పడిందని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రైతులను రెచ్చగొట్టేందుకు సానుభూతి పొందేందుకు కేసీఆర్ నటిస్తున్నారని.. రైతాంగం అర్థం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Big Breaking: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు షాక్..


సాగర్ జలాలతో ఈ ప్రాంత చెరువులు, కుంటలను నింపి త్రాగునీటి ఇబ్బందులను తొలగిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం తీవ్రంగా దెబ్బ తిన్నదన్నారు. బీఆర్ఎస్ నాయకులు లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. నీటి సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని.. ఇది ఎప్పటికీ జరగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పేదల పక్షపాతి అని.. వారి సంక్షేమం కోసం ఎన్ని విధాలైనా కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడుతుందని వెల్లడించారు. వేసవికాలంలో వర్షాలు పడటం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుపిస్తున్నారన్నారు. వర్షాలు అనేవి ఎన్నికల కంటే ముందే వచ్చాయని.. వచ్చిన నీటిని ఆ ప్రభుత్వమే నదులు పాలు చేసిందని మంత్రి పొంగులేటి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

AP Election 2024: ధర్మం వైపు నిలబడండి.. వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు

Phone Tapping: పోలీసుల దర్యాప్తు వేగవంతం.. ఎన్నిచోట్ల ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారంటే?


మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 08 , 2024 | 12:17 PM

Advertising
Advertising