ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Thummala: నేను ఏ పార్టీలో ఉన్నా ఎన్టీఆర్ ఆశయం కోసం పనిచేస్తా

ABN, Publish Date - Jan 01 , 2024 | 09:33 PM

తాను ఏ పార్టీలో ఉన్నా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ( NTR ) సంక్షేమ రాజ్యం ఆశయం కోసం పనిచేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Thummala Nageswara Rao ) వ్యాఖ్యానించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా టీడీపీ నేతల ఆహ్వానం మేరకు సోమవారం నాడు తుమ్మల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి మంత్రి తుమ్మల వెళ్లారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

ఖమ్మం: తాను ఏ పార్టీలో ఉన్నా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ( NTR ) సంక్షేమ రాజ్యం ఆశయం కోసం పనిచేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Thummala Nageswara Rao ) వ్యాఖ్యానించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా టీడీపీ నేతల ఆహ్వానం మేరకు సోమవారం నాడు తుమ్మల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి మంత్రి తుమ్మల వెళ్లారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ... పేదలే దేవుళ్లు సమాజమే దేవాలయమనే నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని అన్నారు. తెలుగువారి కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనత ఎన్టీఆర్‌దేనని చెప్పారు. సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ రూపకల్పన చేయగా దేశవ్యాప్తంగా మార్గదర్శిగా మారారన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం స్థలం రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం శ్రేణులు నిబద్దతగా పనిచేశారన్నారు. ఎన్నికల్లో నా గౌరవం నిలబెట్టిన తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Updated Date - Jan 01 , 2024 | 09:33 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising