TG Politics: ఆ కెనాల్‌కు పేరు పెడతాం.. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Jun 13 , 2024 | 06:46 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం పూసగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్‌ను తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు(గురువారం) పరిశీలించారు.
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని ములకలపల్లి మండలం పూసగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్‌ను తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు(గురువారం) పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్..పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులకు అన్యాయం: మంత్రి ఉత్తమ్
6 నెలల్లో చాలా ప్రాజెక్టులు సందర్శించానని.. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు చాలా అన్యాయం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. గత ప్రభుత్వం రూ. 9వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం రీ డిజైన్ పేరుతో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిందని ధ్వజమెత్తారు. ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక సీతారామ ప్రాజెక్ట్ కెనాల్‌కు రాజీవ్ కెనాల్‌గా పేరు పెడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజాధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేశారు: భట్టి విక్రమార్క
కేవలం రూ. 2654 కోట్లతో అయ్యే ప్రాజెక్టును రూ. 20,000 కోట్లు పెంచి ప్రజాధనాన్ని మాజీ సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (
Bhatti Vikramarka) మండిపడ్డారు. గత ప్రభుత్వం రూ. 8000 కోట్లు ఖర్చుపెట్టి కూడా ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రివ్యూ చేసి ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. పనులు త్వరిత గతిన పూర్తి చేయటానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.ఆగస్ట్ 15వ తేదీలోగా ప్రాజెక్ట్ పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మీద విచ్చల విడిగా డబ్బులు ఖర్చుపెట్టి ఒక్క ప్రాంతంలో కూడా నీరు ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. కానీ ఈ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. ఆగస్ట్ 15వ తేదీ నాటికి నల్గొండ, వైరా ప్రాంతాలకు లక్ష ఇరవై వేల ఎకరాలకు నీరు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Kishan Reddy: భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు కలిసి పని చేద్దాం
Kaleshwaram: జస్టిస్ పీసీ ఘోష్‌ను కలిసిన హైడ్రాలజీ, నిపుణుల కమిటీ ఇంజినీర్లు..
Read Latest Telangana News and Telugu News
Updated Date - Jun 13 , 2024 | 10:48 PM