TG Minister: ఖమ్మంలో కొనసాగుతున్న తెలంగాణ మంత్రుల పర్యటన
ABN, Publish Date - Aug 12 , 2024 | 01:08 PM
Telangana: జిల్లాలో తెలంగాణ మంత్రుల పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఉదయం నేలకొండపల్లి బౌద్ధ స్థూపంని సందర్శించిన మంత్రులు.. అనంతరం ఖమ్మం ఖిల్లాను సందర్శించారు. మంత్రులు భట్టివిక్రమార్క, తుమ్మల నాగేశ్వరావు, జూపల్లి కృష్ణారావు, ఖమం ఎంపీ రఘురాంరెడ్డి ఖిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఖమ్మం జిల్లాలో టూరిజం అభివృద్దికి ప్రత్యేక కృషి జరుగుతోందన్నారు.
ఖమ్మం, ఆగస్టు 12: జిల్లాలో తెలంగాణ మంత్రుల పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఉదయం నేలకొండపల్లి బౌద్ధ స్థూపంని సందర్శించిన మంత్రులు.. అనంతరం ఖమ్మం ఖిల్లాను సందర్శించారు. మంత్రులు భట్టివిక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), తుమ్మల నాగేశ్వరావు (Minister Thummala Nageshwar rao), జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao), ఖమం ఎంపీ రఘురాంరెడ్డి (MP Ragurama Reddy) ఖిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఖమ్మం జిల్లాలో టూరిజం అభివృద్దికి ప్రత్యేక కృషి జరుగుతోందన్నారు. ఖమ్మం ఖిల్లాపై తుమ్మల నాగేశ్వరరావు కోరిక మేరకు టూరిజం శాఖ మంత్రి జూపల్లి రోప్ వే మంజూరు చేశారన్నారు.
Kangana Ranaut: నువ్వు జీవితాంతం ప్రతిపక్షంలోనే కూర్చుంటావు.. రాహుల్‌పై ఎంపీ కీలక వ్యాఖ్యలు
నేలకొండపల్లి బౌద్ధ స్థూపం అభివృద్ధి చేస్తే విదేశాలకు చెందిన టూరిస్ట్‌లను ఆకర్షించేందుకు అవకాశం ఉందన్నారు. ఖమ్మం జిల్లాలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందన్నారు. టూరిజం అభివృద్దికి నిధుల కొరత లేదన్నారు. టూరిజం అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ రాజ్యంలో టూరిజం అభివృద్ధి చేస్తామని చెప్పారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా తెలంగాణలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని తెలిపారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి కేంద్రం నుంచి కూడా నిధులను కోరుతామని భట్టి విక్రమార్క వెల్లడించారు.
Doctors Strike: దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన డాక్టర్లు..కారణం ఇదే
తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖమ్మం నగరానికి అత్యంత సమీపంలో 500 ఎకరాలలో వెలుగుమట్ల పార్కు ఉందన్నారు. వెలుగుమట్ల పార్కులో ఏకో టూరిజంకి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. సత్తుపల్లి కొత్తగూడెం భద్రాచలం పాల్వంచలలో కూడా ఎకో టూరిజంకు అవకాశం ఉందని తెలిపారు. స్తంభాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కాకతీయుల కాలంలో నిర్మించిన కూసుమంచి గణపేశ్వర స్వామి ఆలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాలను టెంపుల్ టూరిజంలో భాగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Jupalli: పర్యాటక అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష
TG News: హైదరాబాద్‌లో భారీగా హషిష్ ఆయిల్ డ్రగ్స్ పట్టివేత
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 12 , 2024 | 01:20 PM