ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: దమ్ముంటే.. ‘మూసీ దర్బార్‌’ పెట్టాలి

ABN, Publish Date - Oct 12 , 2024 | 03:40 AM

సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే మూసీ నిర్వాసితులతో దర్బార్‌ నిర్వహించి.. వారిని తరలించేందుకు ఒప్పించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్‌ చేశారు.

  • నిర్వాసితులతో మాట్లాడి.. ఒప్పించాలి

  • డీపీఆర్‌ లేకుండా ఇళ్ల కూల్చివేతలా..?

  • మీడియాతో కిషన్‌ రెడ్డి చిట్‌చాట్‌

హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే మూసీ నిర్వాసితులతో దర్బార్‌ నిర్వహించి.. వారిని తరలించేందుకు ఒప్పించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్‌ చేశారు. నిర్వాసితులతో సీఎం సమావేశం నిర్వహిస్తే, చర్చించేందుకు తాను కూడా వస్తానని అన్నారు. మూసీ సుందరీకరణ వెనక రేవంత్‌ ప్లాన్‌ వేరే ఉందని విమర్శించారు. మూసీ సుందరీకరణకు సంబంధించి సమగ్ర కార్యాచరణ వెల్లడించకుండా, పేదల ఇళ్లను కూల్చివేయడం సరికాదన్నారు.


‘ఈ ప్రాజెక్టుకు నిధులెక్కడివి..? పనులు ఎలా చేస్తారు..? హైదరాబాద్‌ మురుగునీటి వ్యవస్థకు పరిష్కారం ఎలా..?’ వంటివి చెప్పకుండా పేదల ఇళ్లను కూల్చితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చెరువులు, నాలాల పరిరక్షణే హైడ్రా లక్ష్యమైతే.. పేదల ఇళ్లను కూల్చివేసే ముందు మూసీ మధ్యలో కట్టిన ఎంజీ బస్‌ స్టేషన్‌, మెట్రో స్టేషన్‌ను కూల్చివేయాలని సవాల్‌ చేశారు.

Updated Date - Oct 12 , 2024 | 05:25 AM