ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kishan Reddy: ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం పెరగాలి

ABN, Publish Date - Mar 23 , 2024 | 03:40 PM

పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మే 13వ తేదీన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) పిలుపునిచ్చారు. ఓటింగ్ సమయంలో హైదరాబాద్ నగరంలో ఏ ఎన్నిక వచ్చిన 40శాతం మించి పోలింగ్ జరగడం లేదని చెప్పారు. ఈ సారి ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం పెరగాలని కోరారు.

హైదరాబాద్‌: పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మే 13వ తేదీన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) పిలుపునిచ్చారు. ఓటింగ్ సమయంలో హైదరాబాద్ నగరంలో ఏ ఎన్నిక వచ్చిన 40శాతం మించి పోలింగ్ జరగడం లేదని చెప్పారు. శనివారం నాడు బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఈ సారి ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం పెరగాలని కోరారు. సౌకర్యాలు లేవని ప్రతీ ఒక్కరూ విమర్శిస్తారని.. కానీ ఓటు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. విమర్శించడానికి ఎంత హక్కు ఉందో ఓటు వేసే బాధ్యత కూడా అంతే ఉందని గుర్తించాలని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ కుటుంబ సభ్యులతో చర్చించి అభివృద్ధి చేసే నేతలకు ఓటువేయాలని చెప్పారు.

By Poll: కాంగ్రెస్ కంటోన్మెంట్ అభ్యర్థి ప్రకటనకు ముహూర్తం ఫిక్స్!

కాంగ్రెస్ ప్రభుత్వంలో పాకిస్తాన్ వాళ్లకు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిందని విమర్శించారు. గత తొమ్మిదిన్నరేళ్లుగా పాకిస్తాన్‌కి సంబంధించిన ఐఎస్ఐ ఉగ్రవాదులు దేశంలో చొరబడకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్యలు తీసుకున్నారని వివరించారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపి.. ఆ దేశంలో చిక్కుకున్న 25 వేల మంది భారతీయులను స్వదేశానికి మోదీ తీసుకొచ్చారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో దేశం ఎలా ఉంది.. మోదీ హయాంలో దేశం ఎలా ఉందో తేడా చూసి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలని కిషన్ రెడ్డి కోరారు.

VH: రేవంత్.. నీ స్థాయిని నువ్వే తగ్గించుకోకు!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2024 | 03:57 PM

Advertising
Advertising