ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: ఎందుకీ విజయోత్సవాలు?

ABN, Publish Date - Dec 02 , 2024 | 04:50 AM

ఏడాది పాలనలో ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా.. రూ.కోట్లు వెచ్చించి ఎందుకీ విజయోత్సవాలు..? అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు. ‘మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి..’ అని ప్రజలతో ఓట్లు వేయించుకున్న కాంగ్రె్‌సతో, ఏ మార్పూ సాధ్యం కాదని ఏడాదిలోనే తేలిపోయిందని అన్నారు.

  • ఏడాదిలో ఒక్క హామీనైనా నెరవేర్చారా..?

  • మహిళలకు తలా రూ.27,500 బాకీ

  • రూ.4 వేలు కాదు.. ఉన్న పింఛన్‌ రావట్లే

  • బీసీలకు 20 వేల కోట్లు ఏమయ్యాయి

  • 10 పంటలకు బోనస్‌ ఎటుపోయింది

  • పుట్టిన బిడ్డలకు బంగారు లక్ష్మి ఇచ్చారా?

  • ఏం చేశారని రూ.46 వేల కోట్ల అప్పు

  • ఏడాది పాలనలో ఆర్థిక వ్యవస్థ దివాలా

  • సర్కార్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

  • 6 గ్యారెంటీలు, వైఫల్యాలపై చార్జ్‌షీట్‌

హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఏడాది పాలనలో ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా.. రూ.కోట్లు వెచ్చించి ఎందుకీ విజయోత్సవాలు..? అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు. ‘మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి..’ అని ప్రజలతో ఓట్లు వేయించుకున్న కాంగ్రె్‌సతో, ఏ మార్పూ సాధ్యం కాదని ఏడాదిలోనే తేలిపోయిందని అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు, ఏడాది కాంగ్రెస్‌ పాలనకు ఏమాత్రం తేడాలేదని స్పష్టం చేశారు. ఆదివారం కత్రియా హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. కిషన్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు, ఏడాది పాలనా వైఫల్యాలపై చార్జ్‌షీట్‌ విడుదల చేశారు. అనంతరం కాంగ్రెస్‌ ఏడాది పాలనలో వైఫల్యాలను ఎండగడుతూ కిషన్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘‘ఏడాది పాలనలో ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది. ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండానే సర్కారు ఆర్‌బీఐ నుంచి 9 నెలల్లో రూ.46 వేల కోట్లు అప్పు తీసుకుంది.


చేయూత కింద రూ.4వేల పింఛన్‌ ఇస్తామన్నారు. దాని సంగతేమోగానీ ఉన్న రూ.2వేల పింఛన్‌ కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అని చెప్పి, ఉన్న బస్సులను రద్దుచేశారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలా ఒక్కో మహిళకు రూ.2,500 చొప్పున ఇప్పటి వరకు రూ.27,500 బాకీ పడ్డారు. పుట్టిన ఆడబిడ్డలకు బంగారు లక్ష్మి పథకం అమలు చేస్తామని చెప్పి, ఇప్పటికీ ఇవ్వలేదు. బీసీ సంక్షేమానికి ఏటా రూ.20వేల కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీ ఏమైంది. గురుకుల విద్యార్థులకు మంచి భోజనం కూడా పెట్టలేని దుస్థితి నెలకొంది. విద్యా భరోసా కింద రూ.5 లక్షల బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇస్తామన్న హామీ ఎందుకు అమలుచేయలేదు..? పది పంటలకు బోనస్‌ ఇస్తామని రాహుల్‌, రేవంత్‌ గొప్పగా ప్రకటించారు. ఇప్పుడు వరి పంటకు మాత్రమే, అది కూడా సన్న వడ్లకే అంటున్నారు. భూ కబ్జాలు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన రేవంత్‌.. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. భూ దందా కోసమే మూసీ పునరుజ్జీవం చేపట్టారు. పేదల ఇళ్లు కూల్చకుండా కూడా మూసీ పునరుజ్జీవం చేపట్టవచ్చు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలకు సంబంధించి ఆర్థిక వనరుల సమీకరణపై కాంగ్రె్‌సకు రూట్‌మ్యాప్‌ లేదు’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే, వ్యక్తిగత విమర్శలు చేయడం సీఎం రేవంత్‌కు అలవాటైపోయిందని మండిపడ్డారు. భాష సరిగా ఉంటే.. రుణమాఫీపై చర్చకు తాను సిద్ధమని రేవంత్‌కు సవాల్‌ విసిరారు. ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారని ఎంపీ డీకే అరుణ.. కాంగ్రె్‌సపై మండిపడ్డారు.


  • చార్జ్‌షీట్‌లోని ప్రధానాంశాలు..

‘‘కాళేశ్వరం పేరుతో అప్పుడు లక్ష కోట్ల దోపిడీ.. ఇప్పుడు మూసీ పేరుతో లక్షన్నర కోట్లకు ఎసరు. అప్పుడు పదేళ్లపాటు కే టాక్సు.. ఇప్పుడు అన్నింటా ఆర్‌ఆర్‌ టాక్సు. పేదలకు అందని ఉచిత వైద్య ఫలాలు.. మార్పు రాలే.. బతుకు మారలే’’ అంటూ కాంగ్రెస్‌ వైఫల్యాలను బీజేపీ తన చార్జ్‌షీట్‌లో ఎండగట్టింది. ఎంపీలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, నగేశ్‌, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌ బాబు, కె. వెంకటరమణారెడ్డితో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.


  • రైతు పండుగలు రైతులు చేసుకోవాలి: కొండా

వికారాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రైతు పండుగలను రైతులు చేసుకోవాలని, రాజకీయ పార్టీలు కాదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఈ రోజు తెలంగాణ రైతాంగం బతికి ఉందంటే అది బీజేపీ చలవే అన్నారు. ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం వికారాబాద్‌లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్రను ఎన్టీఆర్‌ చౌరస్తాలో ఎంపీ జెండా ఊపి ప్రారంభించారు.

Updated Date - Dec 02 , 2024 | 04:50 AM