ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: దేశ సమైక్యత ప్రతి ఒక్కరి బాధ్యత

ABN, Publish Date - Aug 15 , 2024 | 03:25 AM

దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

  • రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌ను విస్మరించారు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

అఫ్జల్‌గంజ్‌, ఖైరతాబాద్‌, ముషీరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్ధార్‌ వల్లభాయి పటేల్‌ విగ్రహాన్ని క్షీరాభిషేకం చేసి, పూలమాలతో అలంకరించారు. ఈ సందర్భంగా సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ సమైక్యతను పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు.


ముషీరాబాద్‌ డివిజన్‌లోని హజార్‌గల్లీ, జాంబవీనగర్‌, బాపూజీనగర్‌, బాప్టిస్ట్‌ చర్చి వీధిలో రూ.కోటి నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పైప్‌లైన్‌ నిర్మాణ పనులను ప్రారంభించిన సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌ను విస్మరించారని, నగర అభివృద్ధికి నిధులను కేటాయించలేదని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ‘‘హైదరాబాద్‌ అంటే హైటెక్‌సిటీ కాదు. బస్తీలు, కాలనీల్లో డ్రైనేజీ పొంగిపొర్లలతోంది.


కలుషిత నీరు సరఫరా అవుతోంది. అధ్వానపు రోడ్లతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోవడం లేదు’’ అని మండిపడ్డారు. నగరంలో కనీస సౌకర్యాల కల్పనకు నిధులను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి కృష్ణయాదవ్‌, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌, మహి ళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2024 | 03:25 AM

Advertising
Advertising
<