ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: గత ప్రభుత్వం.. యూసీలు ఇవ్వలేదు

ABN, Publish Date - Sep 09 , 2024 | 04:01 AM

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో విపత్తుల నిర్వహణకు రూ.1300 కోట్ల నిధులు అందుబాటులో ఉండాలని, కానీ, వీటిలో కొంత మొత్తాన్ని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యయం చేసినప్పటికీ..

  • అందువల్లే కేంద్రం రూ.200 కోట్లు విడుదల చేయలేదు

  • వాటి కోసం షాతో మాట్లాడుతున్నా

  • అవసరమైతే ఇంకా నిధులిస్తాం

  • నష్టంపై నివేదిక వచ్చాక కేంద్రం సాయం

  • ఖమ్మంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

  • బాధితుల ఖాతాల్లో నేడు నగదు వేస్తాం: పొంగులేటి

ఖమ్మం బైపా్‌సరోడ్డు/ తిరుమాయపాలెం, హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో విపత్తుల నిర్వహణకు రూ.1300 కోట్ల నిధులు అందుబాటులో ఉండాలని, కానీ, వీటిలో కొంత మొత్తాన్ని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యయం చేసినప్పటికీ.. కేంద్రానికి యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ (యూసీ) పంపలేదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దీనివల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.200 కోట్లు నిలిచిపోయాయన్నారు. ఈ అంశం గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో మాట్లాడి నిధుల విడుదలకు కృషి చేస్తానని చెప్పారు. ఇటీవలి వరదలకు తీవ్రంగా ప్రభావితమైన ఖమ్మం నగర శివారులోని దంసలాపురం కాలనీ, తిరుమలాయపాలెం మండలంలోని రాకాసితండాలో కిషన్‌రెడ్డి ఆదివారం పర్యటించారు. ఆయన వెంట రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశరరెడ్డి తదితరులున్నారు.


ఉదయం 7 గంటలకే రైలులో ఖమ్మం చేరుకున్న కిషన్‌రెడ్డి.. ఇళ్లు కొట్టుకుపోయిన బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సమీపంలోని ఓ ఫంక్షన్‌లో హాల్‌లో వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో సంభవించిన వరద బీభత్సం గురించి సీఎం రేవంత్‌రెడ్డితో ప్రధాని మోదీ, అమిత్‌ షా మాట్లాడి భరోసా ఇచ్చారని తెలిపారు. రైతులకు, ఇతర బాధితులకు స్టేట్‌ డిజాస్టర్‌ ఫండ్‌ (ఎస్‌డీఎఫ్‌) కింద ఉన్న నిధుల ద్వారా అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అవసరమైతే ఇంకా నిధులను మంజూరుచేస్తామన్నారు.


వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రావాల్సి ఉందని, దాని ఆధారంగా కేంద్రం నుంచి నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని, రాజకీయాలు ఎన్నికల సమయంలోనేనని, ఎన్నికల తర్వాత ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో సంభవించిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. ఇప్పటికి రూ.5,438 కోట్ల నష్టం జరిగినట్లు కేంద్రానికి సీఎం నివేదిక పంపారని, కేంద్రం సాయం అందించాలని కోరారు. ప్రజలెవ్వరు ఇబ్బందులు పడవద్దని, సోమవారం ఉదయంలోగా మెదటి విడత సాయం కింద కొంత నగదు బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని తెలిపారు.


  • వంద మందిని పార్టీలో చేర్పించాల్సిందే

బీజేపీ సంస్థాగత సభ్యత్వ పర్వం ప్రారంభం సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీంట్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ పదవుల్లో కొనసాగుతున్న వారు.. తప్పనిసరిగా కనీసం వందమంది చొప్పున సభ్యులను పార్టీలో చేర్పించాల్సిందేనని స్పష్టం చేశారు. వంద మంది సభ్యులను చేర్పించడం ద్వారా క్రియాశీల సభ్యత్వానికి అర్హులవుతారని తెలిపారు.

Updated Date - Sep 09 , 2024 | 04:01 AM

Advertising
Advertising