ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kishan Reddy: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఓటు వేయడం వృథా..

ABN, Publish Date - May 09 , 2024 | 11:33 AM

రాష్ట్రంలో పదేళ్లు బీఆర్‌ఎస్‌ దోచుకుంటే.. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్‌ మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(BJP state president Kishan Reddy) పేర్కొన్నారు.

- నాంపల్లి ప్రచారంలో కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ: రాష్ట్రంలో పదేళ్లు బీఆర్‌ఎస్‌ దోచుకుంటే.. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్‌ మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(BJP state president Kishan Reddy) పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఓటు వేసినా వృథానే, ఎందుకంటే కేంద్రంలో మళ్లీ వచ్చేది మోదీ ప్రభుత్వమే అని ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్‌(Secunderabad) ఎంపీగా తనను ఆశీర్వదించాలని, మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని ఆయన కోరారు. గురువారం నాంపల్లి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మాధవీలతకు శివసేన మద్దతు..

జైన్‌మందిర్‌ తాళ్లగడ్డ వద్ద ప్రారంభమైన ప్రచార యాత్ర శారదనగర్‌, నవోదయకాలనీ, హుడాకాలనీ, శ్రీరామ్‌నగర్‌, రేతిబౌలి, మిలాన్‌ టాకీస్‌, కుమ్మరవాడి మీదుగా ఇందిరానగర్‌, బోయగూడ కమాన్‌, బజార్‌ఘాట్‌, గోకుల్‌ నగర్‌, గోల్కొండ హోటల్‌, పెన్షన్‌ ఆఫీస్‌, శ్రీరామ్‌టెంపుల్‌, హైమద్‌నగర్‌ వరకు సాగింది. యువత బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలింగ్‌ శాతాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. అలాగే జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇదికూడా చదవండి: Annamalai: తెలంగాణ బతుకుల్లో మార్పు రాలేదు...

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 09 , 2024 | 11:33 AM

Advertising
Advertising