Voter ID: మీ ఓటు ఉందా లేదా? ఒక్క క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
ABN, Publish Date - May 11 , 2024 | 07:36 PM
Election Commission of India: ఓటు వేయడం ఓటరుగా(Voter) ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు వేసే ఓటే దేశ, రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. మంచి నాయకుడిని ఎన్నుకుని.. దేశ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయండి. ప్రస్తుతం ఏపీ(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో కలిపి ..
Election Commission of India: ఓటు వేయడం ఓటరుగా(Voter) ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు వేసే ఓటే దేశ, రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. మంచి నాయకుడిని ఎన్నుకుని.. దేశ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయండి. ప్రస్తుతం ఏపీ(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో కలిపి సరాసరి 8 కోట్ల వరకు ఓటర్లు ఉన్నారు. వీరిలో చాలా మందికి తమ ఓటు ఉందా? లేదా? అనే సందిగ్ధంలో ఉంటారు. అలాంటి సమయంలో ఈజీగా.. ఒక్క క్లిక్‌తో మీ ఓటు ఉందా? లేదా? ఉంటే ఎక్కడ ఉంది? మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఎంత? అనే వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం డైరెక్ట్ లింక్ మీకు అందిస్తున్నాం.
ఇక్కడ ఇచ్చిన(కోసం ఇక్కడ క్లిక్ చేయండి) లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ ఓటు ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? మీ పోలింగ్ స్టేషన్ సీరియల్ నెంబర్ ఎంత? అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ లింక్‌పై క్లిక్ చేసిన తరువాత ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. EPIC నెంబర్ ద్వారా చూడటం, మీ పేరు, ఇతర వివరాల ద్వారా వెతకడం, మొబైల్ నెంబర్ ఆధారంగా వెతికే ఛాన్స్ ఉంటుంది. ముందుగా ఎపిక్ నెంబర్ ద్వారా చూసినట్లయితే.. పేజీ ఓపెన్ అయిన తరువాత ముందుగా మీ బాషను(Select Language) ఎంచుకోవాలి. ఆ తరువాత మీ ఓటర్ కార్డుపై ఉండే ఎపిక్ నెంబర్(EPIC Number) పై క్లిక్ చేయండి. ఆ తరువాత రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. ఆ తరువాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తరువాత సెర్చ్ కొడితే మీ ఓటర్ వివరాలు కనిపిస్తాయి.
For More Election News and Telugu News..
Updated Date - May 11 , 2024 | 08:00 PM