ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Komatireddy Venkat Reddy: వస్తే గౌరవం పెరుగుతోంది.. లేకుంటే..

ABN, Publish Date - Dec 08 , 2024 | 04:05 PM

తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరయితే ఆయన గౌరవం పెరుగుతుందన్నారు.

TG Minister Komatireddy Venkat Reddy

హైదరాబాద్, డిసెంబర్ 08: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల సాకరం చేసిన తల్లి సోనియా గాంధీ జన్మదినం రేపు అంటే.. డిసెంబర్ 9వ తేదీ అని.. ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఏర్పాట్లను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తెలంగాణ అంటే దొరలు, దొరసానులు కాదన్నారు. రజాకార్లపై తిరుగుబాటు చేసిన సాధారణ మహిళలని ఆయన తెలిపారు. వారి చరిత్ర తెలంగాణలో ఉందని ఆయన వివరించారు. ఆ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సాధారణ మహిళ రూపంలో తయారు చేశామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.


కిషన్‌రెడ్డికి తెలంగాణకు సంబంధం లేదు..

అయితే తెలంగాణ తల్లి ఆవిష్కరణకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వస్తే.. ఆయన గౌరవం పెరుగుతోందని.. ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకాకుంటే తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణతో సంబంధం లేదని కుండ బద్దలు కొట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీలో నాటి ఎమ్మెల్యే యండల లక్ష్మీనారాయణ తన పదవికీ రాజీనామా చేశారని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. కానీ కిషన్ రెడ్డి మాత్రం తన పదవికి రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కాని నేతలకు తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమానికి అందరూ రావాలని ఆహ్వానిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.


మాజీ సీఎం కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానించిన ప్రభుత్వం

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆహ్వానించింది. శనివారం అంటే.. డిసెంబర్ 7వ తేదీన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించారు.


అందుకే డిసెంబర్ 9వ తేదీ..

మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో నాటి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తయారు చేయించారు. తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ సైతం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించింది. ఈ నేపథ్యంలో ఇరు విగ్రహాలు మధ్య రూపు రేఖల్లో తీవ్ర మార్పు ఉంది. దీంతో అటు ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీల నేత మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.

ఇంకోవైపు 2014లో నాటి యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ 23 జిల్లాలతో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌ నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో.. ఆ రాష్ట్ర వాసుల కల సాకారమైనట్లు అయింది. దీంతో సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9వ తేదీ. దాంతో ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.

For Telangana News And Telugu News

Updated Date - Dec 08 , 2024 | 04:05 PM