ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Komatireddy Venkatareddy: రోడ్ల నిర్మాణంలో అలసత్వం వద్దు..

ABN, Publish Date - Jun 06 , 2024 | 03:25 AM

గత ఐదేళ్లలో రోడ్ల నిర్మాణం జరగకపోవడం వలన రోడ్లు అధ్వాన్నంగా మారి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వరుసగా ఎన్నికల కోడ్‌లు రావడంతో పనులన్నీ పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు.

  • పనులు చేపట్టి.. పూర్తి చేయాలి

  • 4 టిమ్స్‌ పనుల్లో వేగం పెంచండి

  • సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి ఆదేశం

  • సచివాలయంలో పార్కింగ్‌పైనా చర్చ

  • వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశం

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో రోడ్ల నిర్మాణం జరగకపోవడం వలన రోడ్లు అధ్వాన్నంగా మారి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వరుసగా ఎన్నికల కోడ్‌లు రావడంతో పనులన్నీ పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు. ఇకపై రోడ్ల నిర్మాణంలో అలసత్వం వహించొద్దని, పనులను వెంటనే ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సచివాలయంలో ఆ శాఖ కార్యదర్శి విజయేందిర బోయి సహా అధికారులతో బుధవారం మంత్రి సమీక్షించారు. రోడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు 24 గంటలు పనిచేసేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్‌కు నాలుగువైపులా రూ.5వేల కోట్లతో నిర్మిస్తున్న 4 టిమ్స్‌ ఆస్పత్రుల నిర్మాణ పురోగతిని ఆరా తీశారు.


నిధుల కొరత లేకపోయినప్పటికీ పనుల్లో జాప్యం జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఉస్మానియా, నిమ్స్‌, గాంధీ ఆస్పత్రులకు రోగుల తాకిడి ఎక్కువగా ఉందని, కొత్త ఆసుపత్రుల్లో సగం అంతస్తులనైనా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.2వేల కోట్లతో చేపట్టిన సీఆర్‌ఐఎఫ్‌ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా, అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ కార్యక్రమం సహా వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం తాను అమెరికా వెళ్తున్నానని, ఆరు రోజులు అక్కడే ఉంటానని మంత్రి తెలిపారు. తిరిగి వచ్చేసరికి పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.


సచివాలయంలో పార్కింగ్‌పై చర్చ

సచివాలయంలో పార్కింగ్‌, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆరా తీసిన మంత్రి కోమటిరెడ్డి.. పార్కింగ్‌ షెడ్స్‌ లేకుండా ప్లాన్‌కు ఎలా అనుమతిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఉద్యోగులు సహా ఇతరత్రా వాహనాల డ్రైవర్లకు టాయిలెట్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆదేశించారు. సచివాలయంలో పార్కింగ్‌కు సంబంధించి సోలార్‌ రూఫ్‌టాప్‌ విధానాన్ని రూపొందించామని అఽధికారులు వివరించగా.. వెంటనే టెండర్లు పిలిచి, నిర్మాణం ప్రారంభించాలని ఆదేశించారు.

Updated Date - Jun 06 , 2024 | 03:25 AM

Advertising
Advertising