ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Komatireddy Venkatareddy: ‘ఎన్‌’ కన్వెన్షన్‌పై చర్యలు తీసుకోండి

ABN, Publish Date - Aug 25 , 2024 | 03:49 AM

ఎన్‌ కన్వెన్షన్‌పై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాధ్‌కు ఈ నెల 21నేలేఖ రాశారు.

  • హైడ్రా కమిషనర్‌కు 21నే కోమటిరెడ్డి లేఖ

మొయునాబాద్‌ రూరల్‌/హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఎన్‌ కన్వెన్షన్‌పై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాధ్‌కు ఈ నెల 21నేలేఖ రాశారు. ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌లో ఎత్తైన ప్రహరీ నిర్మించారని లేఖలో ప్రస్తావించారు. ఈ నిర్మాణాల వలన తమ్మిడికుంట చెరువులో నీటి పరిమాణం తగ్గిపోతుందని తెలిపారు. కాగా, చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా కమిటీ తన పని తాను చేస్తుందని, ఇందులో సందేహాలకు తావులేదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.


రంగారెడ్డి జిల్లాలోని హిమాయత్‌నగర్‌లో ఆయన మాట్లాడారు. ఆక్రమణల తొలగింపుల్లో రాజకీయాలకు తావే లేదని, ఇటీవల కాంగ్రెస్‌ కీలక నేత ఫాంహౌ్‌సను సైతం కూల్చివేశారని గుర్తు చేశారు. 111జీవో విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత తనదని, అధికారులు ఎవరైనా ఇబ్బంది పెడితే తన దృష్టికి తేవాలని నాయకులకు సూచించారు.

Updated Date - Aug 25 , 2024 | 03:49 AM

Advertising
Advertising
<