ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Konda Surekha: భేదాభిప్రాయాలు వీడి పని చేయండి.. మెదక్ మనదే..

ABN, Publish Date - Apr 12 , 2024 | 12:46 PM

మెదక్‌లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని... ఇతర పార్టీలు బీసీలను పట్టించుకోలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. నేడు పఠాన్ చెరు మండలం గణేష్ గడ్డ గణేష్ దేవస్థానం వద్ద కాంగ్రెస్ ప్రచార రథాలకు పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు.

Konda Surekha

సంగారెడ్డి: మెదక్‌లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని... ఇతర పార్టీలు బీసీలను పట్టించుకోలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. నేడు పఠాన్ చెరు మండలం గణేష్ గడ్డ గణేష్ దేవస్థానం వద్ద కాంగ్రెస్ ప్రచార రథాలకు పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ (Konda Surekha) మాట్లాడుతూ.. మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. ప్రణాళికాబద్ధంగా పార్టీ విజయానికి కృషి చేస్తున్నామన్నారు. పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని కొండా సురేఖ పిలుపునిచ్చారు. శాసనసభ ఎన్నికలలో కొంత కమ్యునికేషన్ గ్యాప్‌తో ఇక్కడ ఓటమి పాలయ్యామన్నారు. పొరపాట్లు సాధారణంగా జరుగుతుంటాయని.. వాటిని మనమే పరిష్కారం చేసుకుందామన్నారు. బేషజాలు, భేదాభిప్రాయాలు వీడనాడి పార్టీ గెలుపునకు పనిచేయాలని సురేఖ తెలిపారు.

Hyderabad: ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ఎంఎంటీఎస్‌లు రద్దు..


అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు మాత్రమే పోటీ ఉంటుందన్నారు. మేము కొట్టే పంజాలకు ఇతర పార్టీలు గిలగిల కొట్టుకోవాల్సిందేనన్నారు. మెదక్ పార్లమెంట్ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ.. బీసీలకు కాంగ్రెస్ మాత్రమే అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ సారి మెదక్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండాయేనని అన్నారు. ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ గెలుస్తుందన్నారు.

TS Govt: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 12 , 2024 | 12:46 PM

Advertising
Advertising