Konda Surekha: విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. దిగొచ్చిన కొండా సురేఖ.. ఏమన్నారంటే
ABN , Publish Date - Oct 03 , 2024 | 07:13 AM
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న వేళ.. ఆమె ఓ మెట్టు దిగొచ్చారు. అక్కినేని, సమంత కుటుంబానికి బాధించడం తన ఉద్దేశం కాదని ఆమె అన్నారు. ఈ మేరకు సమంత ఎక్స్ పోస్ట్‌కు మంత్రి రిప్లై ఇచ్చారు.
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న వేళ.. ఆమె ఓ మెట్టు దిగొచ్చారు. అక్కినేని, సమంత కుటుంబానికి బాధించడం తన ఉద్దేశం కాదని ఆమె అన్నారు. ఈ మేరకు సమంత ఎక్స్ పోస్ట్‌కు మంత్రి రిప్లై ఇచ్చారు. సినీ రంగంలో సమంత ఎదిగిన తీరు తనకు ఆదర్శమన్నారు.
'మహిళా నాయకుల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించాలన్నదే నా ఉద్దేశం. మీ మనోభావాలు దెబ్బ తీయాలని కాదు. స్వశక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం. మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నా. క్షమించండి’ అంటూ సమంతకు ఎక్స్‌లో రీపోస్ట్ చేశారు.
సమంత ఏమన్నారంటే..
నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోండి.. నా పేరును మీ రాజకీయ పోరాటాలకు వాడకోకండి.. అంటూ మంత్రి కొండా సురేఖ (Konda Surekha)కు సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్‌ని ఉద్దేశిస్తూ అక్కినేని ఫ్యామిలీతో ముడిపెడితూ.. కొండా సురేఖ సమంత విడాకుల గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కింగ్ నాగార్జున తీవ్రంగా ఖండిస్తూ.. అబద్దాలుగా కొట్టిపారేశారు. తాజాగా సమంత కూడా ఇన్‌స్టా వేదికగా మంత్రికి సమాధానమిచ్చింది. సమంత (Samantha) తన పోస్ట్‌లో ఏం చెప్పిందంటే...
‘‘స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి పని చేయడానికి, స్త్రీలను ఆసరాగా భావించే ఆకర్షణీయమైన పరిశ్రమలో మనుగడ సాగించడానికి, ప్రేమలో పడటానికి మరియు ప్రేమలో నుంచి బయట పడటానికి, ఇంకా నిలబడి పోరాడటానికి.. వీటన్నింటికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారూ, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి దీనిని చిన్నచూపు చూడకండి.
ఒక మంత్రిగా మీ మాటకు చాలా వేల్యూ ఉంటుందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను. వ్యక్తుల గోప్యత పట్ల బాధ్యతగా మరియు గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. విషయాలను ప్రైవేట్‌గా ఉంచాలనే మా ఎంపిక తప్పుగా సూచించడాన్ని ఆహ్వానించను. నా విడాకులు పరస్పర అంగీకారం మరియు సామరస్యపూర్వకంగా జరిగాయి. ఇందులో ఎటువంటి రాజకీయ కుట్రకు ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను మరియు అలానే కొనసాగించాలనుకుంటున్నాను..’’ అంటూ సమంత తన పోస్ట్‌లో పేర్కొంది.
ఎవరెవరు ఏమన్నారంటే..
‘‘గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.’’ - కింగ్ నాగార్జున
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ?.. - ప్రకాశ్ రాజ్
‘‘సినిమా రంగంలో ఉన్న ఆడవారికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది. మిగతా రంగాల్లో పనిచేసే ఆడవారికి ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తున్నారో.. ఆత్మగౌరవాన్ని ఇస్తున్నారో అలాగే సినిమా ఆడవారికి కూడా గౌరవం ఇవ్వండి’’. - నటి హేమ
‘‘అక్కినేని నాగార్జునగారి కుటుంబంపై తెలంగాణ కేబినెట్ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలకు నేను షాక్ అయ్యాను. నేను ఆమె ప్రతి మాటను తీవ్రంగా ఖండిస్తున్నాను మరియు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని అభ్యర్థిస్తున్నాను. నేను ఎంతో గౌరవించే మీరు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, సినీ ఇండస్ట్రీలోని మహిళలపై ఆమె చేసిన బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పించాలని కోరుతున్నాను. ఇది ఖచ్చితంగా ఒక చెడ్డ ఉదాహరణగా మిగిలిపోతుంది. అలాగే సినీ ఇండస్ట్రీకి చెందిన వారంతా మంత్రి కొండా సురేఖ చేసిన అర్థం పర్థంలేని కామెంట్స్‌ని ఖండించాల్సిందిగా కోరుతున్నాను’’ - కోన వెంకట్
‘‘సురేఖ అక్కా.. అందరినీ ఒకే గాటన కట్టడం తప్పు! అక్కడ ఆడపిల్లలు.. నువ్వు అక్కవి, అక్కలా మాట్లాడాలి.. ప్లీజ్’’ - కాదంబరి కిరణ్
‘‘రాజకీయ మైలేజీ కోసం సినీ పరిశ్రమలో మహిళలపై దుష్ప్రచారం ఆపండి. మంత్రి కొండా సురేఖ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం’’ -వాయిస్ ఆఫ్ ఉమెన్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ
Konda Surekha: ఛీ ఛీ.. అసహ్యమేస్తోంది .. కొండా సురేఖపై జూ.ఎన్టీఆర్, నాని మండిపాటు
Naga Chaitanya: సిగ్గు.. సిగ్గు.. సురేఖ కామెంట్స్‌పై నాగచైతన్య మండిపాటు
Konda Surekha: విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. దిగొచ్చిన కొండా సురేఖ.. ఏమన్నారంటే
For Latest News and Telangana News click here