ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Konda Visveshwar Reddy: మోదీ వేవ్‌ తెలంగాణలోనూ కనిపిస్తోంది: కొండా

ABN, Publish Date - Apr 28 , 2024 | 01:11 PM

దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నరేంద్రమోదీ వేవ్‌ కనిపిస్తోందని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Konda Visveshwar Reddy) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్‌, హైదర్‌నగర్‌(Madapur, Hydernagar) ప్రాంతాల్లో పర్యటించారు.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నరేంద్రమోదీ వేవ్‌ కనిపిస్తోందని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Konda Visveshwar Reddy) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్‌, హైదర్‌నగర్‌(Madapur, Hydernagar) ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోబోతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని ఎన్నికల్లో న్యాయబద్ధంగా కాంగ్రెస్‌ ఎదుర్కోలేకపోతోందని ఆయన విమర్శించారు. ఆ పార్టీ ముస్లిం ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

ఇదికూడా చదవండి: RTC Bus Drivers: ఎండలతో బేజారు.. హడలిపోతున్న ఆర్టీసీ బస్‌డ్రైవర్లు

ఎంఐఎం కన్నా కాంగ్రెస్ కే ముస్లిం వర్గాల ఓట్లు అధికంగా పోలవుతాయని విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా మియాపూర్‌ ప్రాంతంలోని దివ్యశక్తి అపార్ట్‌మెంట్‌, మయూరి నగర్‌ పార్క్‌, వేర్టెక్స్‌ ప్రైడ్‌, హైదర్‌నగర్‌ పరిధిలోని వశిష్ట అపార్ట్‌మెంట్‌, కావ్య గ్రీన్‌ అపార్ట్‌ మెంట్‌, వేర్టెక్స్‌ ప్రెసెంట్‌, వేర్‌ టెక్స్‌ కళ్యాణ్‌ రెసిడెన్సీ, ఎస్సార్‌ రెసిడెన్సీ, జలవాయు విహార్‌ కమ్యూనిటీహాల్‌ తదితర ప్రాంతాల్లోని ప్రజలతో ఆయన మాట్లాడారు. మే 13న జరగనున్న పోలింగ్‌లో కమలం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి బీజేపీ నాయకుడు రవికుమార్‌ యాదవ్‌, గచ్చిబౌలి కార్పొరేటర్‌, గంగాధర్‌ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, హరిబాబు, రాజు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: KTR: ఇచ్చిన మాట నిలబెట్టుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం: కేటీఆర్‌

Updated Date - Apr 28 , 2024 | 01:11 PM

Advertising
Advertising