Hyderabad: ఐఐటీ-జేఈఈ, నీట్ డిజిటల్ మెటీరియల్ సిద్ధం
ABN, Publish Date - Aug 20 , 2024 | 05:56 AM
నీట్, జేఈఈ-2025 ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ‘కోటా‘ డిజిటల్ మెటీరియల్ సిద్ధమైంది.
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నీట్, జేఈఈ-2025 ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ‘కోటా‘ డిజిటల్ మెటీరియల్ సిద్ధమైంది. ఈమేరకు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం తెలిపింది. ఈ డిజిటల్ మెటీరియల్‌లో 2025కు సంబంధించిన స్టడీ మెటీరియల్ (కాన్సెప్ట్స్, మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు), 2025 ‘కోటా’ గ్రాండ్ టెస్టులు, కోటా‘ ప్రీవియస్ టెస్టులు, సొల్యూషన్స్, ర్యాంక్ బూస్టర్ టెస్టులు, ఎన్‌సీఈఆర్‌టీ నీట్ క్వశ్చన్ బ్యాంక్‌ను వాట్సాప్ ద్వారా పొందవచ్చని పేర్కొంది. వాట్సాప్ ద్వారా పొందేవారు ూఉఉఖీ 25 అని, జేఈఈ వారు ఒఉఉ 25 అని టైపు చేసి 9849016661 కు వాట్సాప్ మెసేజ్ చేయాలని ఫోరం సూచించింది.
Updated Date - Aug 20 , 2024 | 05:56 AM