ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Krishna Mohan Reddy: కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే బండ్ల..

ABN, Publish Date - Jul 07 , 2024 | 04:05 AM

బీఆర్‌ఎ్‌సలో మరో వికెట్‌ పడింది. ఆ పార్టీకి చెందిన, జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరుకున్నారు.

  • బీఆర్‌ఎస్‌లో మరో వికెట్‌ డౌన్‌

  • రేవంత్‌ సమక్షంలో చేరిన కృష్ణమోహన్‌రెడ్డి

  • ఒకట్రెండు రోజుల్లో మరికొందరు గులాబీ ఎమ్మెల్యేలు!

  • ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావు

  • క్యాబినెట్‌ హోదా ఇచ్చిన ప్రభుత్వం

హైదరాబాద్‌/గద్వాల, జూలై 6 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సలో మరో వికెట్‌ పడింది. ఆ పార్టీకి చెందిన, జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో కృష్ణమోహన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, దానం నాగేందర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


వాస్తవానికి కృష్ణమోహన్‌రెడ్డి చేరిక నాలుగు రోజుల కిందటే ఖరారైనా.. స్థానికంగా గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌ సరితా తిరుపతయ్య అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించడంతో వాయిదా పడుతూ వచ్చింది. దీంతో సీఎం రేవంత్‌ శనివారం తొలుత సరితతో మాట్లాడి నచ్చజెప్పారు. ఆ తర్వాత సరిత, కృష్ణమోహన్‌రెడ్డి ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. ఏదైనా సమస్య వస్తే తన వద్దకు తీసురావాలని సూచించారు. దీంతో సరిత చల్లబడ్డట్లు తెలిసింది. కానీ, కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకొనే సమయంలో మాత్రం ఆమె హాజరుకాలేదు.


ఇదిలా ఉండగా.. ఇప్పటికి బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు చేరింది. మూడింట రెండొంతుల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. పలువురితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరనున్నట్లు తెలిసింది.

Updated Date - Jul 07 , 2024 | 08:53 AM

Advertising
Advertising
<