ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR : బాన్సువాడలో ఉప ఎన్నిక ఖాయం

ABN, Publish Date - Aug 14 , 2024 | 04:12 AM

: బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయమని, పార్టీ మారిన పోచారం శ్రీనివా్‌సరెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

  • పోచారం శ్రీనివా్‌సరెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు

  • బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులతో కేటీఆర్‌

  • గురుకులాల సమస్యలపై ప్రభుత్వం

  • స్పందించడం సంతోషమేనని వ్యాఖ్య

హైదరాబాద్‌, ఆగస్టు13 (ఆంధ్రజ్యోతి): బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయమని, పార్టీ మారిన పోచారం శ్రీనివా్‌సరెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఆ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు మంగళవారం నందినగర్‌లోని కేటీఆర్‌ నివాసంలో ఆయనను కలిశారు. ఈసందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కార్యకర్తల కష్టంపై గెలిచి స్వార్థం కోసం పోచారం పార్టీ వీడటం కార్యకర్తలను బాధించిందని,. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే ఎంత పెద్దవారైనా వదిలిపెట్టేది లేదన్నారు. కాంగ్రె్‌సలో చేరిన పోచారంను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఆయన పార్టీ వీడినా.. అక్కడి బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు మాత్రం పార్టీ మారలేదన్నారు. బాన్సువాడ ఉప ఎన్నికలో పోచారం శ్రీనివా్‌సరెడ్డిని ఓడిస్తామని చెప్పారు. కాగా, ఇప్పటివరకు మొద్దునిద్రపోయిన కాంగ్రెస్‌ సర్కారు ఇప్పటికైనా గురుకులాల సమస్యలపై స్పందించడమే సంతోషమేనని, కనీస సౌకర్యాలు కల్పించి విద్యార్థుల బాధలు తీర్చాలని కేటీఆర్‌ పేర్కొన్నారు. కలుషిత ఆహారం కారణంగా 500 మందికి పైగా విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారని, గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించేలా చూడాలన్నారు.

గురుకులాల్లో మిగిలిన పోస్టులను భర్తీ చేయాలి

గురుకులాల్లో చేపట్టిన నియామకాల్లో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులను మెరిట్‌ జాబితాలోని తదుపరి అభ్యర్థులతో భర్తీ చేయాలని కేటీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురుకుల అభ్యర్థులు పలువురు మంగళవారం నందినగర్‌లో కేటీఆర్‌ను కలిశారు. గురుకులాల్లో భారీగా ఏర్పడే ఖాళీలను నిరుద్యోగులు నష్టపోకుండా తదుపరి మెరిట్‌ ఉన్నవారిని ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని గురుకుల అభ్యర్థులు తెలిపారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌ గురుకులాల్లో భర్తీ కాకుండా మిగిలిపోయే పోస్టుల్లో తదుపరి మెరిట్‌ అభ్యర్థులకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించేలా ప్రతిపక్ష పార్టీగా నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తామని వెల్లడించారు.

Updated Date - Aug 14 , 2024 | 04:12 AM

Advertising
Advertising
<