KTR: ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
ABN, Publish Date - Mar 27 , 2024 | 12:40 PM
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డి పైన కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రంజిత్ రెడ్డి ఎవరో మన పార్టీ సీటు ఇచ్చి గెలిపించుకున్న తర్వాతనే ప్రపంచానికి తెలిసిందన్నారు.
హైదరాబాద్: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ (Congress)లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డి (MP Ranjith Reddy) పైన కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రంజిత్ రెడ్డి ఎవరో మన పార్టీ సీటు ఇచ్చి గెలిపించుకున్న తర్వాతనే ప్రపంచానికి తెలిసిందన్నారు. 2019లో రాజకీయాలకు కొత్త అయినా పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఆయనను గెలిపించారన్నారు. రంజిత్ రెడ్డికి రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యతనిచ్చామన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయనని రాజకీయాల నుంచి తప్పుకుంటానని పార్టీకి చెప్పారని కేటీఆర్ తెలిపారు.
Raghunandan Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ముద్దాయిగా చేర్చాలి..
కేవలం అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి బీఅర్ఎస్ పార్టీని విడిచి ద్రోహం చేశారన్నారు. కవితపైన కేంద్ర ప్రభుత్వ (Central Government) సంస్థలు సోదాల పేరుతో దాడి చేసి.. అరెస్టు చేసిన రోజే..కాంగ్రెస్‌లో చేరిన స్వార్థపరుడు రంజిత్ రెడ్డి అని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి (Visweswar Reddy) కూడా ఇలానే పార్టీ మారి వెళ్లారన్నారు. పార్టీ కన్నా తానే ఎక్కువ అనుకొని ఇతర పార్టీలోకి వెళితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసన్నారు. ఒక పార్టీ కన్నా తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరన్నారు. అదే నిజమైతే దేశంలో పార్టీలుండవని... స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), రంజిత్ రెడ్డి కలిసినంత మాత్రాన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిపోతాయనుకోవడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు.
Big Breaking: వార్ జోన్‌గా ఛత్తీస్‌గడ్ దండ కారణ్యం.. ఆరుగురు మావోల మృతి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 27 , 2024 | 12:40 PM