ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KTR: ఇచ్చిన మాట నిలబెట్టుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం: కేటీఆర్‌

ABN, Publish Date - Apr 28 , 2024 | 12:28 PM

కాంగ్రెస్‌ పార్టీ బూటకపు వాగ్దానాలతో గద్దెనెక్కిందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోనందుకు పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించాలని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(BRS Party Working President KTR) అన్నారు.

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ బూటకపు వాగ్దానాలతో గద్దెనెక్కిందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోనందుకు పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించాలని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(BRS Party Working President KTR) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి టి.పద్మారావుగౌడ్‌(T. Padmaraogowd)కు మద్దతుగా ఎర్రగడ్డ డివిజన్‌లోని పలు బస్తీల్లో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆరు గ్యారెంటీలు ఎక్కడ నెరవేర్చారని ప్రశ్నించారు.

ఇదికూడా చదవండి: KCR: మోదీకి ఓటేస్తే వినాశనమే

ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయడానికి అప్పటి టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంతో కృషి చేసిందని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌(BRS) అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి పద్మారావుగౌడ్‌ మాట్లాడుతూ తనను గెలిపిస్తే సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేదీప్య రావు, రాజ్‌కుమార్‌ పటేల్‌, ఎర్రగడ్డ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు డి.సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్‌ ఖురేషి, నాయకులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండిం: Harish Rao: రాజీనామా లేఖతో రేవంత్‌ రాలేదేం?

Read Latest National News and Telugu News

Updated Date - Apr 28 , 2024 | 12:28 PM

Advertising
Advertising