ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR : చీ(ఫ్‌)ప్‌ మినిస్టర్‌ గుర్తుంచుకో..

ABN, Publish Date - Aug 21 , 2024 | 04:07 AM

‘‘నామాటలు గుర్తుంచుకో.. చీ(ఫ్‌)ప్‌ మినిస్టర్‌.. మేం అధికారంలోకి వచ్చిన తొలిరోజే బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తాం’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌..

  • మేం వచ్చాక సచివాలయ పరిసరాల్లో చెత్తను తొలగిస్తాం

  • మానసిక రుగ్మత నుంచి రేవంత్‌ కోలుకోవాలి

  • రుణమాఫీపై రేపు బీఆర్‌ఎస్‌ ధర్నాలు: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ‘‘నామాటలు గుర్తుంచుకో.. చీ(ఫ్‌)ప్‌ మినిస్టర్‌.. మేం అధికారంలోకి వచ్చిన తొలిరోజే బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తాం’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. సచివాలయం ఎదుట రాజీవ్‌ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ స్పందించారు.

‘‘నీలాంటి ఢిల్లీ గులాం (బానిస) తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అర్థం చేసుకోలేరు. చిన్నపిల్లల ముందు చెత్తమాటలు మాట్లాడిన రేవంత్‌ నైజం, వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తుంది. నీ మానసిక రుగ్మతనుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’’ అంటూ సీఎంను ఉద్దేశించి కేటీఆర్‌ పేర్కొన్నారు.


అదేవిధంగా సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదానికి కారణమైన సంస్థను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చాలన్న తమ డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదని, అదే సంస్థకు కొడంగల్‌ లిఫ్ట్‌ఇరిగేషన్‌ ప్రాజెక్టును అప్పజెప్పాలని చూస్తోందని, దీనివెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

అలాగే.. ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 22న అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్‌ఎస్‌ తరఫున ధర్నాలు నిర్వహించనున్నట్లు కేటీఆర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 9లోపు రుణమాఫీ చేస్తామన్న రేవంత్‌రెడ్డి ఆ తర్వాత ఆగస్టు 15 అంటూ మాట తప్పారని, ఇప్పుడు అడ్డగోలు ఆంక్షలు పెట్టి 40ు మంది రైతులకు మాఫీ చేయకుండా ఎగ్గొట్టారన్నారు.


లక్షలాది మంది రైతన్నలకు అండగా నిలిచి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ధర్నా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఒకవైపు సీఎం రేవంత్‌రెడ్డి రూ.2లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయ్యిందని చెబుతుంటే.. మరోవైపు మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తికాలేదని చెబుతున్నారన్నారు. రైతుందరికీ రూ.2లక్షలు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 21 , 2024 | 04:07 AM

Advertising
Advertising
<