KTR : కాంగ్రెస్ దాడులను ఎదుర్కొందాం
ABN, Publish Date - Oct 30 , 2024 | 05:15 AM
‘‘రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ తమపై చేస్తున్న రాజకీయ వేధింపుల ప్రహసనంగా భావించాల్సి వస్తోంది.
బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘‘రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ తమపై చేస్తున్న రాజకీయ వేధింపుల ప్రహసనంగా భావించాల్సి వస్తోంది. ఇకముందు మనపై మరిన్ని వేధింపులు ఉంటా యి. కాంగ్రెస్ చేసే వ్యక్తిగత దాడులు, కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందాం’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ మంగళవారం పార్టీ శ్రేణులకు ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి అవినీతి, వైఫల్యాలను ఎత్తిచూపినందుకే బీఆర్‌ఎ్‌సపై ఆయన అసహనంతో ఉన్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సర్కారుకు అక్రమ కేసులపై ఉన్నమోజు.. ఆరోగ్యశాఖపై లేకుండా పోయిందని ఆరోపించారు. రోగుల కష్టాలను విస్మరిస్తున్నారని, పెద్దాస్పత్రుల ఆలనాపాలనా చూడటం లేదని, మందుల కొరతను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజలపై విద్యుత్ భారం మోపడాన్ని ప్రధాన ప్రతిపక్షంగా వ్యతిరేకించామని, బహిరంగ విచారణలో పాల్గొని దీనిపై ఈఆర్సీని ఒప్పించలిగామని కేటీఆర్ చెప్పారు. విద్యుత్ చార్జీలపెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించినందుకుగాను బుధవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Updated Date - Oct 30 , 2024 | 05:15 AM