Land dispute: ఎమ్మార్పీఎస్ నేతను నిర్బంధించిన ఫాంహౌస్ కూల్చివేత..
ABN, Publish Date - Jul 23 , 2024 | 03:32 AM
ఇటీవల ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్‌ను నిర్బంధించిన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ధర్మగిరిగుట్టలోని ఫాంహౌ్‌సను పోలీసుల సూచనలతో సోమవారం మునిసిపల్ సిబ్బంది కూల్చివేశారు.
శంషాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్‌ను నిర్బంధించిన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ధర్మగిరిగుట్టలోని ఫాంహౌ్‌సను పోలీసుల సూచనలతో సోమవారం మునిసిపల్ సిబ్బంది కూల్చివేశారు. రాజేంద్రనగర్ మునిసిపాలిటీ నార్సింగి బృందావన్ కాలనీలోని ఓ భూ వివాదానికి సంబంధించి రౌడీషీటర్లు ఎమ్మార్పీఎస్ నేత నరేందర్‌ను కిడ్నాప్ చేసి శంషాబాద్ ధర్మగిరిగుట్టలో వారి పాంహౌ్‌సలో నిర్బంధించి అతడిపైకి కుక్కలను వదిలి భయభ్రాంతులకు గురిచేయగా.. పోలీసులు దర్యాప్తు చేసి నరేందర్‌ను సురక్షితంగా ఇంటికి చేర్చిన విషయం తెలిసిందే.
నార్సింగిలోని బృందావన్ కాలనీకి చెందిన నిందితులు అహ్మద్ ఖాన్, షేక్ హమ్దాస్, జాఫర్, మసూద్, మరికొందరు కలిసి అక్షయ్ సక్సేనా, అతడి సోదరులకు చెందిన 200 గజాల భూమిని పదేళ్ల క్రితం ఆక్రమించి ఈ ఫాంహౌ్‌సను కట్టినట్టు దర్యాప్తులో తేలింది. పోలీసుల సూచనలతో శంషాబాద్ మునిసిపల్ కమిషనర్ భూ రికార్డులు పరిశీలించగా అనుమతులు లేకుండా ఫాంహౌస్ నిర్మించినట్టు నిర్ధారితమైంది. దీంతో మూడు జేసీబీలతో ఫాంహౌ్‌సను కూల్చివేశారు.
Updated Date - Jul 23 , 2024 | 03:32 AM