ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Regional Ring Road,: రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వం

ABN, Publish Date - Oct 04 , 2024 | 03:20 AM

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్వాసితులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని పలువురు వక్తలు స్పష్టం చేశారు.

  • పెద్దఎత్తున ఉద్యమిస్తాం..మహాధర్నాలో వక్తలు

కవాడిగూడ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్వాసితులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని పలువురు వక్తలు స్పష్టం చేశారు. రైతులు, భూనిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వడం గానీ, ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు గానీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద ఆర్‌ఆర్‌ఆర్‌ భూనిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంంలో జరిగిన మహాధర్నాలో ఎంపీ ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఆర్‌.కృష్ణయ్య తదితరులు ప్రసంగించారు.


ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. చౌటుప్పల్‌, భువనగిరి వద్ద ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను వెంటనే మార్చాలని డిమాండ్‌ చేశారు. గజ్వేల్‌, ఫార్మాసిటీ భూనిర్వాసితులు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారని, వారికి కూడా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. రైతులకు జరుగుతున్న అన్యాయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉందంటే.. తాను ముందుండి కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ‘‘ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు.


ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ ఆలోచనలకు భిన్నంగా.. కొంతమంది అవసరాలకు అనుగుణంగా ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను మార్చే ప్రయత్నం జరిగిందంటూ దుయ్యబట్టారు. రైతులు, భూనిర్వాసితుల పోరాటానికి బీఆర్‌ఎస్‌ మద్దతుంటుందని భరోసా ఇచ్చారు. మాజీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. ట్రిపుల్‌ ఆర్‌పై రైతులు, నిర్వాసితులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు తెగించి పోరాడాలని పిలుపునిచ్చారు. మూసీ సుందరీకరణ పేరుతో లక్షన్నర కోట్లను వెచ్చిస్తూ.. అనేక సంవత్సరాలుగా నివాసముంటున్న వారిని నిరాశ్రయులను చేస్తున్నారని మండిపడ్డారు.

Updated Date - Oct 04 , 2024 | 03:20 AM