మంత్రిగా కొనసాగే నైతిక హక్కు షాకు లేదు
ABN, Publish Date - Dec 31 , 2024 | 04:51 AM
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్‌షాకు కేంద్ర మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని వామపక్ష నేతలు పేర్కొన్నారు.
హైదరాబాద్ నారాయణగూడలో వామపక్ష నేతల నిరసన
బర్కత్‌పుర, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్‌షాకు కేంద్ర మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని వామపక్ష నేతలు పేర్కొన్నారు. అమిత్‌షాను కేంద్రమంత్రి వర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని, ఆయన దేశ ప్రజలకు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అంబేడ్కర్‌పై అమిత్‌షా అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని నారాయణగూడలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఐ రాష్ట్ర సభ్యులు వలిఉల్లాఖాద్రీ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు జె.వి.చలపతిరావు, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకుడు ప్రవీణ్, ఎంసీపీఐ (యు) కార్యదర్శి జి.రవి, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ కార్యదర్శి రమేశ్ రాజా, ఎస్‌యూసీఐ (సీ) నాయకుడు తేజా మాట్లాడారు. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తెచ్చేందుకు మనువాదులు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని వారు విమర్శించారు. దేశాన్ని విచ్ఛిన్నం చే సి హిందూ రాజ్యం స్థాపించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా పక్కదారి పట్టించడంలో భాగంగానే అమిత్‌షా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వామపక్ష నేతలు విమర్శించారు.
Updated Date - Dec 31 , 2024 | 04:51 AM