Legislative Assembly: ఆగస్టు 2 వరకు బడ్జెట్ సమావేశాలు!
ABN, Publish Date - Jul 25 , 2024 | 03:06 AM
శాసనసభ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నట్లు తెలు స్తోంది. అసెంబ్లీలోని స్పీకర్ ప్రసాద్‌కుమార్ చాంబర్‌లో మంగళవారం సమావేశమైన శాసనసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ..
పలు బిల్లుల ఆమోదం దృష్ట్యా పొడిగింపు
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): శాసనసభ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నట్లు తెలు స్తోంది. అసెంబ్లీలోని స్పీకర్ ప్రసాద్‌కుమార్ చాంబర్‌లో మంగళవారం సమావేశమైన శాసనసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ.. ఈ నెల 31 కల్లా పూర్తిస్థాయి బడ్జెట్‌ను, ద్రవ్య వినిమయ బిల్లునూ ఆమోదించు కోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏడు పనిదినాలనూ ఖరారు చేసింది. అయితే సమావేశాలను కనీసం 15రోజుల పాటు నిర్వహించాలంటూ బీఆర్‌ఎస్ ఎల్పీ, బీజేఎల్పీలు డిమాండ్ చేయడంతో నిర్ణయాధికా రాన్ని స్పీకర్‌కు వదిలేసింది.
అయితే స్కిల్స్ యూని వర్సిటీ.. విద్య, రైతు కమిషన్ల ఏర్పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు వంటి బిల్లులను ఇదే సమావేశాల్లో పెట్టే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. అలాగే రైతు భరోసా విధివిధానాలు, జాబ్ క్యాలెండర్ ప్రకటన చేసేందుకూ ఏర్పాట్లు చేస్తోంది. వీటితో పాటుగా బడ్జెట్, ద్రవ్యవినిమయ బిల్లుల ఆమో దానికి సమయం సరిపోదన్న అంచనాకు ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే నెల 2 వరకు సమావేశాలను కొనసాగించాలని భావిస్తోంది. ఈనెల 31, ఆగస్టు 1,2 తేదీల్లో బిల్లులపై చర్చ, ఆమోదం.. జాబ్‌క్యాలెండర్ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
Updated Date - Jul 25 , 2024 | 03:06 AM