ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మహిళలకు రుణ బీమా!

ABN, Publish Date - Jun 27 , 2024 | 03:50 AM

స్వయం సహాయక సంఘం (ఎస్‌హెచ్‌జీ)లోని మహిళలు ఎవరైనా అనుకోని సందర్భంలో మరణిస్తే.. వారు తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు పేద కుటుంబాలు అవస్థలు పడుతుంటాయి. సదరు మహిళ కుటుంబ సభ్యులు చెల్లించలేని పరిస్థితి ఉంటే.. ఇతర గ్రూపు సభ్యులే ఆ రుణ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది.

  • స్వయం సహాయక సంఘాలకు మాత్రమే

  • ప్రస్తుతం.. సంఘంలో మహిళ మరణిస్తే

  • రుణం చెల్లింపు బాధ్యత కుటుంబానిది లేదా గ్రూపుది

  • ఇకపై బీమా కంపెనీది.. అదనంగా కుటుంబానికి సొమ్ము

  • త్వరలోనే బీమా కంపెనీతో సర్కారు ఒప్పందం

  • మహిళలకు రుణ బీమా!

హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి) : స్వయం సహాయక సంఘం (ఎస్‌హెచ్‌జీ)లోని మహిళలు ఎవరైనా అనుకోని సందర్భంలో మరణిస్తే.. వారు తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు పేద కుటుంబాలు అవస్థలు పడుతుంటాయి. సదరు మహిళ కుటుంబ సభ్యులు చెల్లించలేని పరిస్థితి ఉంటే.. ఇతర గ్రూపు సభ్యులే ఆ రుణ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది. ఈ అవస్థలకు చెక్‌ పెడుతూ ఎస్‌హెచ్‌జీ మహిళలకు రుణ బీమాను వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మహిళలకు జీవిత బీమాతోపాటు వారు పొందిన రుణాలపైనా బీమా వర్తింపజేసేలా చర్యలు చేపట్టింది. ఈ విధానం అమల్లోకి వచ్చాక.. రుణం తీసుకున్న మహిళ మరణిస్తే సంబంధిత రుణాన్ని సదరు బీమా కంపెనీ చెల్లిస్తుంది.


సదరు మహిళ కుటుంబానికి 10లక్షల మేర బీమా సొమ్ము అందుతుంది. రాష్ట్రంలోని 6.1లక్షల ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లోని 61లక్షల మంది మహిళలకు బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎన్నికల కోడ్‌ ఉండడంతో బీమా ప్రీమియం చెల్లింపు ప్రక్రియ చేపట్టలేదు. లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ఎస్‌హెచ్‌జీ మహిళలకు జీవిత బీమాతోపాటు, వారు తీసుకున్న రుణాలకూ బీమాను వర్తింపజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం బీమా కంపెనీతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సంబంధిత విభాగాలు తెలిపాయి. మరణించిన మహిళ వివరాలను స్త్రీనిధి పోర్టల్‌ అప్‌లోడ్‌ చేశాక.. 15 రోజుల్లోగా బీమా క్లెయిమ్‌ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ వర్గాలు తెలిపాయి.

Updated Date - Jun 27 , 2024 | 03:50 AM

Advertising
Advertising