Madhukar Reddy: కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు..
ABN, Publish Date - Apr 30 , 2024 | 12:11 PM
కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని బీఆర్‌ఎస్ నాయకుడు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి(Madhukar Reddy) అన్నారు. మంగళవారం మూడుచింతలపల్లి మండలంలోని అనంతారం గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కొరకు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
మూడుచింతలపల్లి(హైదరాబాద్): కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని బీఆర్‌ఎస్ నాయకుడు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి(Madhukar Reddy) అన్నారు. మంగళవారం మూడుచింతలపల్లి మండలంలోని అనంతారం గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కొరకు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అలాగే రైతుల విన్నపం మేరకు గ్రామంలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ అందించి రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా ఎదిగేలా చేశారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తరువాత విద్యుత్ సరఫరా లేక రైతుల పంటలు ఎండిపోయి రోడ్డున పడుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారని వాపోయారు.
ఇదికూడా చదవండి: Hyderabad: కాంగ్రెస్ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం..
కేసీఆర్ మాత్రమే రైతులను ఆదుకున్నారని రైతులకు మార్గదర్శకుడిగా వెన్నుదన్నులా నిలుస్తూ వారి జీవితాల్లో ఆనందాన్ని నింపారన్నారు. కాంగ్రెస్ రాక్షస పాలన పోయి కేసీఆర్ పాలన రావాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని రైతులను కోరుతున్నామని తెలిపారు.
రైతుల పంటలు ఎండిపోతున్నాయని గ్రామగ్రామాన తిరిగి రైతులను ఓదార్చుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం అవన్నీ అబద్దాలు అని ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని, పంటలు ఎండిపోయి నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షడు మల్లేష్ గౌడ్, మాజీ సర్పంచులు విష్ణువర్ధన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: JP Nadda: వికసిత్ భారత్ కోసమే ఈ ఎన్నికలు..
ఇదికూడా చదవండి: Etala Rajender: బీజేపీతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యం..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 30 , 2024 | 12:11 PM