Share News

CM Revanth Reddy: నేడు మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Jul 09 , 2024 | 07:29 AM

మహబూబ్ నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

CM Revanth Reddy: నేడు మహబూబ్‌నగర్  జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

మహబూబ్ నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar dist.) కేంద్రానికి రానున్నారు. ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అలాగే సాగునీరు, విద్య, వైద్యం అంశాలు చర్చకు రానున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పరుగులు పెట్టనున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొత్తగా రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టే అవకాశముంది. మహబూబ్ నగర్‌లో ఎన్.ఐ.టి కోసం స్థానిక ఎమ్మెల్యే.. యెన్నం శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది.


నేడు పాలమూరు ప్రాజెక్టులపై సీఎం సమీక్ష

కాగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే ప్రజాప్రతినిధులతో రెండు దఫాలుగా మంత్రుల స్థాయులో సమీక్షలు జరగ్గా.. మంగళవారం మహబూబ్‌నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం సమీక్ష ఏర్పాట్లపై సోమవారం జలసౌధలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు.. నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌తో సమావేశమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తగా చేపట్టే, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల వివరాలను ఇవ్వాలని మంత్రి ఉత్తమ్‌ అధికారులను ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోదీ.. మీరో శక్తి

ఇంత నీచమా... అతన్ని చూస్తే అసహ్యమేస్తోంది!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 09 , 2024 | 07:29 AM