ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mahesh Kumar Goud: సోనియా వల్లే తెలంగాణ

ABN, Publish Date - Dec 07 , 2024 | 04:00 AM

సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని, ఆమె లేనిదే ప్రత్యేక రాష్ట్రం లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహే్‌షకుమార్‌ గౌడ్‌ అన్నారు. డిసెంబరు 9న సోనియా జన్మదినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

  • ఆమె లేనిదే ప్రత్యేక రాష్ట్రం లేదు

  • 9న ఘనంగా సోనియా జన్మదినోత్సవాలు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని, ఆమె లేనిదే ప్రత్యేక రాష్ట్రం లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహే్‌షకుమార్‌ గౌడ్‌ అన్నారు. డిసెంబరు 9న సోనియా జన్మదినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. సోనియా జన్మదినోత్సవాలకు మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రజల పండుగని.. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీభవన్‌ ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. రాజీవ్‌ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించిందని, కేటీఆర్‌ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారని ప్రశ్నించారు.


అధికారం కోల్పోయినా కేటీఆర్‌లో ఏమాత్రం అహంకారం తగ్గలేదని, ఇప్పటి కైనా ఆయన పగటికలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. బీఆర్‌ఎస్‌ హ యాంలో లక్షల కోట్ల దోపిడీ జరిగిందని, ఇక ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉందని కితాబు ఇచ్చారు. సీఎం రేవంత్‌ పాలనలో ఎలాంటి నిర్బంధం లేదని.. ప్రతి ఒక్కరూ ేస్వచ్ఛగా నిరసన తెలుపుకొనే అవకాశం ఉందని చెప్పారు. శాంతి భద్రతలకు భంగం కల్గించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి వాడిన భాష సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉందని.. చట్టం ఎవరికీ చుట్టం కాదని పేర్కొన్నారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలంగాణకు చేసిన మేలు ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 07 , 2024 | 04:00 AM