ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bhatti Vikramarka: ఇండియా కూటమి రాగానే రైతు రుణమాఫీ

ABN, Publish Date - May 28 , 2024 | 04:17 AM

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. పంజాబ్‌ రాష్ట్రం ఫరీద్‌కోట్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కోటక్‌పుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..

  • కూటమికి ఆదరణ చూసి మోదీలో ఆందోళన

  • పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో భట్టి

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. పంజాబ్‌ రాష్ట్రం ఫరీద్‌కోట్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కోటక్‌పుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ... అధికారం చేపట్టగానే ఓ కమిషన్‌ ఏర్పాటు చేస్తామని, రైతులకు రుణమాఫీ అవసరమైన ప్రతిసారీ ఆ కమిషన్‌ ప్రభుత్వానికి తెలియజేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బిలియనీర్లు అయిన అదానీ, అంబానీలు నడుపుతున్నారన్నారు,


ప్రధాని అదానీ గ్రూపులకు విమానాశ్రయాలు, రైల్వే ేస్టషన్లు విక్రయించి తన పరువు పోగొట్టుకున్నారని, ఈ దేశం పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతి పరిస్థితులకు బీజేపీ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు పెద్ద మార్పు తీసుకురాబోతున్నారని, దీంతో ఇండియా కూటమికి వస్తున్న ఆదరణ చూసి మోదీ ఆందోళన చెందుతున్నారన్నారు. అందుకే విపక్షాలపై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

Updated Date - May 28 , 2024 | 04:17 AM

Advertising
Advertising