ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court Ruling: వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు ముందుకురావాలి

ABN, Publish Date - Aug 11 , 2024 | 04:26 AM

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలు చేసేందుకు రాష్ట్రాలు ముందుకు రావాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కోరారు.

  • మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రధానిని కోరా

  • సీఎంలతో భేటీ నిర్వహించాలని విజ్ఞప్తి చేశాను

  • నవంబరు 11న విశ్వరూప సభ: మంద కృష్ణ మాదిగ

న్యూఢిల్లీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలు చేసేందుకు రాష్ట్రాలు ముందుకు రావాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కోరారు. ఈ విషయంలో రాష్ట్రాలు స్పందించకపోతే సుప్రీం కోర్టు తీర్పును ఉల్లఘించినట్లవుతుందని పేర్కొన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేసేలా ఆయా రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు.


ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌ ఉన్న రాష్ట్రాల సీఎంలతో భేటీ నిర్వహించాలని విజ్ఞప్తి చేయగా...ప్రధాని సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు 30 ఏళ్లుగా ఎంతోమంది సహకరించారని, వారిలో ఏపీ సీఎం చంద్రబాబు ముందు వరుసలో ఉంటారని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఏపీలో అమలు చేస్తామని ప్రకటించారని, దానికి కట్టుబడి కేబినెట్‌లో ఆమోదించారని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సైతం వర్గీకరణను అమలు చేస్తామని శాసనసభలోనే ప్రకటించడం హర్షణీయమన్నారు. నవంబరు 11న హైదరాబాద్‌లో నిర్వహించనున్న విశ్వరూప సభకు వర్గీకరణకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరినీ ఆహ్వానించి కృతజ్ఞతలు చెబుతామని తెలిపారు.

Updated Date - Aug 11 , 2024 | 04:26 AM

Advertising
Advertising
<