Hyderabad : బీసీ ఉద్యమానికి ఆయుధం ‘మా వాటా మాకే’
ABN, Publish Date - Aug 14 , 2024 | 06:17 AM
తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ రాసిన ‘మా వాటా మాకే’ పుస్తకం బీసీ ఉద్యమానికి భావజాల ఆయుధం అవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఈ పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు.
జూలూరు గౌరీశంకర్ పుస్తకావిష్కరణలో వక్తలు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ రాసిన ‘మా వాటా మాకే’ పుస్తకం బీసీ ఉద్యమానికి భావజాల ఆయుధం అవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఈ పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ 77 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో బీసీ సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా లేదన్నారు. కులగణనకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడుతోందని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు.
నిజానికి నెల రోజుల్లో కులగణన చేయించవచ్చన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు, ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ లక్ష్మణ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు మాట్లాడారు.
Updated Date - Aug 14 , 2024 | 06:48 AM