ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Radha Banti: మా బిడ్డను అన్యాయంగా చంపారు..

ABN, Publish Date - Aug 23 , 2024 | 04:36 AM

మావోయిస్టులు తమ బిడ్డను అన్యాయంగా చంపారని మావోయిస్టు రాధ బంటి (పల్లెపాటి) తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

  • ఆమె జనజీవన స్రవంతిలోకి రావడం మావోయిస్టులకు ఇష్టం లేదు.. తప్పిదాలు బయటపడతాయనే కక్ష గట్టారు

  • మావోయిస్టు రాధ కుటుంబ సభ్యుల ఆరోపణ

  • న్యాయం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి వేడుకోలు

  • ఇంటికొస్తుందనుకున్నా. 3రోజుల క్రితం పోలీసులూ ఇదే చెప్పారు: తల్లి

  • నేను పోలీస్‌ ఏజెంట్‌ను కాదు.. రాధ తమ్ముడు సూర్యప్రకాశ్‌

కాప్రా, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టులు తమ బిడ్డను అన్యాయంగా చంపారని మావోయిస్టు రాధ బంటి (పల్లెపాటి) తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆరేళ్ల క్రితం రాధను మావోయిస్టుగా మార్చింది వారేనని.. ఇప్పుడేమోనిర్దాక్షిణ్యంగా చంపి రోడ్డుపై పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాధ జనజీవన స్రవంతిలోకి రావాలని అనుకుందని, ఇందుకు మావోయిస్టులు అడ్డుచె ప్పారని, పైగా పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ అంటూ ఓ కట్టుకథను సృష్టించారని విమర్శించారు.


తమ తప్పిదాలు ఎక్కడ బయటపడతాయోనన్న కక్షతోనే రాధను చంపారని ఆరోపించారు. ఇన్‌ఫార్మర్‌ పేరిట మావోయిస్టు రాధ అలియాస్‌ నీల్సోను బుధవారం తెల్లవారుజామున మావోయిస్టులు హత్య చేసిన విషయం తెలిసిందే. సమాచారం అందగానే కుటుంబసభ్యులు భద్రాచలం వెళ్లి ఆమె మృతదేహాన్ని గురువారం ఉదయం కాప్రా ఇందిరానగర్‌కు తీసుకొచ్చారు.


మావోయిస్టు ఉద్యమ నాయకుల్లో వర్గ విభేదాలు ఉన్నాయని, దళితురాలైనందువల్లనే రాధను హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కాగా రాధ అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం జరిగాయి. కాప్రా ఇందిరానగర్‌లోని ఆమె నివాసం నుంచి మృతదేహాన్ని సాయిబాబానగర్‌ శ్మశానవాటికకు తీసుకెళ్లి కుటుంబ సభ్యులు, బందువుల సమక్ష్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సందర్భంగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.


  • సీఎం మా కుటుంబాన్ని ఆదుకోవాలి

ఆరేళ్ల తర్వాత కూతురు ఇంటికి తిరిగివస్తుందనుకున్నా. మూడురోజుల క్రితం పోలీసులు కూడా ఇదే విషయం చెప్పారు. అంతలోనే కూతురు శవమై రావడం తట్టుకోలేకపోతున్నా. ఏం జరిగిందో తెలియదు కానీ మావోయిస్టులు మా కుటుంబానికి తీరని అన్యాయం చేశారు. నా కూతురు పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ కాదు. నా బిడ్డను చంపిన మావోయిస్టులు నా కొడుకుపై కూడా పోలీస్‌ ఏజెంట్‌ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకోవాలి.

- పోచమ్మ, రాధ తల్లి


  • ఇలా ఎప్పుడూ జరగలేదు

మావోయిస్టుల్లో అగ్రవర్ణాల వారిదే చెల్లుతుంది. దళితురాలు కావడంతోనే మా చెల్లెను మావోయిస్టులు చంపారు. ఒక మహిళా మావోయిస్టును మావోయిస్టులే చంపడం ఎప్పుడూ జరగలేదు. మృతదేహాన్ని ఎక్కడ ఉంచారో తెలుసుకోవడానికి వర్షంలో చీకట్లో తిరిగాం. మా అనుమతిలేకుండా పోస్ట్‌ మార్టం ఎలా చేస్తారు? మా చెల్లి పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ అని మా తమ్ముడు పోలీస్‌ ఏజెంట్‌ అని మావోయిస్టులు చెబుతున్నది నిజం కాదు

- శివలింగం, రాధ అన్న


  • మా అక్క డబ్బులు పంపుతుందనడం అబద్ధం

మా అక్క నాకు డబ్బులు పంపుతున్నదని మావోయిస్టులు అనడం అబద్ధం. నేను పోలీస్‌ ఏజెంట్‌ను కాదు. మాది పేద కుటుంబం. నేను క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నా. అక్క మావోయిస్టుల్లో చేరాక అమ్మానాన్నల క్షేమ సమాచారం గురించి అప్పుడప్పుడు మెసేజ్‌ పెట్టేది. మావోయిస్టుగానే ఉండిపోతాన నేది. కానీ ఇటీవల జనజీవన స్రవంతిలోకి రావాలనుకుంది. అది మావోయిస్టులకు నచ్చలేదు. వారు చేసిన తప్పులు బయట పడతాయనే మావోయిస్టులు ఈ పనిచేశారు. మా అక్కను పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ అంటూ చంపారు.

- సూర్యప్రకాశ్‌, రాధ తమ్ముడు

Updated Date - Aug 23 , 2024 | 04:36 AM

Advertising
Advertising
<