ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medak Church: నూరు వసంతాల శాంతి చిహ్నం!

ABN, Publish Date - Dec 23 , 2024 | 04:26 AM

ఖండాంతర ఖ్యాతిగాంచిన మెదక్‌ చర్చి నిర్మాణమై సరిగ్గా వందేళ్లు గడుస్తున్నాయి. ఈ సందర్భంగా చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా ఆధ్వర్యంలో శత జయంతి వేడుకలకు ఈ చర్చి ముస్తాబైంది.

  • శత జయంతి ఉత్సవాలకు మెదక్‌ చర్చి ముస్తాబు.. వేడుకలను ప్రారంభించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

  • క్రిస్మస్‌ సంబరాల్లో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి

మెదక్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఖండాంతర ఖ్యాతిగాంచిన మెదక్‌ చర్చి నిర్మాణమై సరిగ్గా వందేళ్లు గడుస్తున్నాయి. ఈ సందర్భంగా చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా ఆధ్వర్యంలో శత జయంతి వేడుకలకు ఈ చర్చి ముస్తాబైంది. దేశ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ఈ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలను జరుపుకోవడానికి విదేశాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు.ఈ ఏడాది ఉత్సవాలకు సీఎం రేవంత్‌ రెడ్డి హాజరుకానున్నారు. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా సీఎ్‌సఐ డయాసిస్‌ పరిధిలోని 15 మండలాల పీఠాధిపతులు మెదక్‌కు రానున్నారు. శతాబ్ది ఉత్సవాలను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆదివారం ప్రారంభించారు.


చర్చి చరిత్ర ఇదీ..

1914లో ఇంగ్లండ్‌కు చెందిన క్ర్తెస్తవ మత బోధకుడు చార్లెస్‌ వాకర్‌ పాస్నెట్‌ మెదక్‌లో చర్చి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం నాటి నిజాం రాజు 120 ఎకరాల స్థలం కేటాయించారు. ఆ కాలంలో స్థానికంగా కరువు తాండవిస్తోంది. తిండి, తిప్పలు లేక అల్లాడుతున్న ఇక్కడి ప్రజలను ఆదుకోవడానికి చర్చి నిర్మాణం చేపట్టి వందలాది మందికి ఉపాధి కల్పించారు. పది సంవత్సరాల పాటు ఈ చర్చి నిర్మాణం సాగింది. ఇంగ్లాండ్‌, ఇటలీ, జర్మనీ దేశాల నుంచి ఇంజనీర్లు, శిల్పులు వచ్చి చర్చి నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ప్రస్తుతం మెదక్‌ చర్చి దేశంలోనే రెండో అతి పెద్ద చర్చిగా బాసిల్లుతోంది. 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకున్న మెదక్‌ చర్చికి ఉన్న 175 అడుగుల టవర్‌(గోపురం) చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నాడు సిమెంట్‌ బదులుగా డంగు సున్నం వినియోగిస్తూ పూర్తిగా రాళ్లతో దీన్ని కట్టారు.


సుమారు 5 వేలమంది భక్తులు ఒకేసారి ప్రార్థనలు చేసేందుకు వీలుగా విశాలమైన ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. హాలులో ధ్వని ప్రతిధ్వనించకుండా అప్పట్లోనే పలు రసాయనాలను వినియోగించి నిర్మించడం విశేషం. ఈజిప్ట్‌కి చెందిన గోథిక్‌ శైలిలో ఈ చర్చిని నిర్మించడానికి ఇంగ్లండ్‌ ఇంజనీర్‌ బ్రాడ్‌షా ప్లాన్‌ రూపొందించారు. వాస్తు శిల్పి ఽథామస్‌ ఎడ్వర్డ్‌ నగిషీలు చెక్కారు. చర్చి లోపల పైకప్పు శిలువ ఆకారంలో అందంగా నిర్మించారు. ఇటలీ దేశానికి చెందిన శాలి్‌షబరీ ఆధ్వర్యంలో గాజుముక్కలతో క్రీస్తు చరిత్ర చిత్రాలు, ఆయన జీవితంలో ప్రధాన ఘట్టాలను చర్చి హాలుకు మూడువైపులా రంగు రంగుల గాజు ముక్కలతో చిత్రించడం విశేషం. చర్చి ముఖ ద్వారానికి ఎదురుగా ఏసుప్రభువు పునరుత్థానం చెందిన దృశ్యం చూపరులను కట్టిపడేస్తుంది. ఆయన జన్మ వృత్తాంతం కనిపిస్తుంది. ఉత్తరం వైపున శిలువ వేయబడిన దృశ్యం ఎంతో సజీవంగా ఉండి భక్తులను కంటతడి పెట్టిస్తుంది. ఇందులోని ప్రత్యేకత కేవలం సూర్యకిరణాలు ప్రసరించడం ద్వారా మాత్రమే ఈ అపురూపమైన చిత్రాలు గోచరిస్తాయి.


శాంతిని కోరేవారికి నిలువెత్తు సాక్ష్యం

  • గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

  • మెదక్‌ చర్చి శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

మెదక్‌, కొల్చారం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సమాజంలో శాంతిని కోరేవారికి మెదక్‌ క్యాథడ్రల్‌ చర్చి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ కొనియాడారు. మెదక్‌ క్యాథడ్రల్‌ సీఎ్‌సఐ చర్చి నిర్మాణం పూర్త యి వంద సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. సండే ప్రేయర్‌ అనంతరం క్రైస్తవ గురువులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంద సంవత్సరాల సంబరాలు విశ్వాసం, తపన, భగవంతుడి ఆమోఘమైన కృపకు నిదర్శనంగా నిలిచే మహత్తర ఘట్టమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌, చర్చి ప్రెసిబిటరి ఇన్‌చార్జి రెవరెండ్‌ శాంతయ్య తదితరులు పాల్గొన్నారు. మెదక్‌ జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్‌ ఆదివారం కొల్చారం మండల కేంద్రంలోని బాలికల గురుకులపాఠశాల, జూనియర్‌ కళాశాల విద్యార్థినులతో ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు విద్యార్థినులతో కలిసి ఆయన భోజనం చేశారు.

Updated Date - Dec 23 , 2024 | 04:26 AM