ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP Vs Congress: నన్ను అనవసరంగా గెలుకుతున్నారు.. జాగ్రత్త అంటూ బండి ఫైర్

ABN, Publish Date - Feb 27 , 2024 | 11:34 AM

Telangana: అయోధ్య రాముడి విషయంలో కాంగ్రెస్‌ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బీజేపీ ఎంపీ బండిసంజయ్ స్పష్టం చేశారు. మంగళవారం ప్రజాహిత యాత్రలో ఎంపీ మాట్లాడుతూ.. ‘‘అయోధ్యలో రాముడు జన్మించినట్లు గ్యారెంటీ ఏంటని మీరు ప్రశ్నిస్తే, నేను నా తల్లికి పుట్టినట్టు గ్యారెంటీ ఏంటి అంటే నువ్వెందుకు మీదేసుకుంటున్నావు.

సిద్దిపేట, ఫిబ్రవరి 27: అయోధ్య రాముడి విషయంలో కాంగ్రెస్‌ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బీజేపీ ఎంపీ బండి సంజయ్ (BJP MP Bandi Sanjay) స్పష్టం చేశారు. మంగళవారం ప్రజాహిత యాత్రలో ఎంపీ మాట్లాడుతూ.. ‘‘అయోధ్యలో రాముడు జన్మించినట్లు గ్యారెంటీ ఏంటని మీరు ప్రశ్నిస్తే, నేను నా తల్లికి పుట్టినట్టు గ్యారెంటీ ఏంటి అంటే నువ్వెందుకు మీదేసుకుంటున్నావు. నన్ను అనవసరంగా గెలుకుతున్నారు, నేను శాంతియుతంగా ప్రజాహిత యాత్ర చేపడితే మీకేం వచ్చింది. ఎక్కడ నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు (Minister Ponnam Prabhakar) సవాల్ విసురుతున్న.. నేను నా విశ్వాసాలతో రాముడు పేరిట ఎన్నికల్లో నిలుచుంటా, నువ్వు నీ వాదనతో నీ అభ్యర్థిని నిలబెట్టు. నేను ఓడితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.. వ్యాపారం చేసుకుని బతుకుతా, మళ్ళీ రాముడని, హిందూ మతమని మాట్లాడను. ఒకవేళ నువ్వు ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటావా? పొన్నంతో రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి. మొదటి నుంచి రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన వారిలో పొన్నం ఉన్నారు. ఇలాంటి అలజడులలో రేవంత్‌ను (CM Revanth) ఇరికించి ఆయన పదవి కిందకి నీళ్ళు తేవచ్చు. బీఆర్‌ఎస్‌లో కేటీఆర్ (KTR), కాంగ్రెస్‌లో (Congress) పొన్నంలు మోపైండ్లు. కేటీఆర్ వాగుడుతో బీఆర్‌ఎస్ మునిగింది.. పొన్నంతో కాంగ్రెస్ మునగడం ఖాయం’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 27 , 2024 | 12:01 PM

Advertising
Advertising