ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BRS: చందాపూర్ కెమికల్ ఫ్యాక్టరీ బాధితులను పరామర్శించిన హరీష్‌రావు

ABN, Publish Date - Apr 04 , 2024 | 02:41 PM

Telangana: జిల్లాలోని హత్నూర మండలం చందాపూర్ కెమికల్ ఫ్యాక్టరీలో గాయపడి సంగారెడ్డి ఎంఎన్‌ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను మాజీ మంత్రి హరీష్‌రావు పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించి కలెక్టర్ వల్లూరు క్రాంతితో హరీష్‌రావు ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదం దురదృష్టకరమన్నారు. బాధితులను ఆదుకోవడంలో యాజమాన్యం, ప్రభుత్వం విఫలం అయ్యాయని విమర్శించారు.

సంగారెడ్డి, ఏప్రిల్ 4: జిల్లాలోని హత్నూర మండలం చందాపూర్ కెమికల్ ఫ్యాక్టరీలో గాయపడి సంగారెడ్డి ఎంఎన్‌ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister Harish Rao) పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించి కలెక్టర్ వల్లూరు క్రాంతితో హరీష్‌రావు ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదం దురదృష్టకరమన్నారు. బాధితులను ఆదుకోవడంలో యాజమాన్యం, ప్రభుత్వం విఫలం అయ్యాయని విమర్శించారు. సహాయ చర్యలు కూడా సరిగ్గా జరగలేదని.. బాధితుల గోడు వినడం లేదన్నారు. ప్రమాదంలో గాయపడ్డవారిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

YS Jagan: నాడు నెల్లూరులో ఏర్పడిన అల్పపీడనమే..


సాయం కోరుతున్న వారిపై దురుసుగా ప్రవర్తించడాన్ని ఖండిస్తున్నాం. తమిళనాడు, మధ్యప్రదేశ్‌కు చెందిన మృతుల కుటుంబాలను ఆదుకోవాలని... భౌతిక కాయాలను స్వస్థలాలకు చేర్చడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలన్నారు. అధికారుల, యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని.. యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి పంపించాలని హరీష్‌ రావు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి...

BRS: బీఆర్ఎస్‌ను దెబ్బేసింది ఇదే.. 'సారు'కు తెలిసొచ్చింది!

AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపీణీపై ఓ కన్నేసిన సీఈసీ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 04 , 2024 | 02:46 PM

Advertising
Advertising