ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP: ఎంపీ ఎన్నికలు కాగానే రాహుల్ గాంధీ అక్కడికే వెళ్తారు: కిషన్‌రెడ్డి

ABN, Publish Date - Feb 25 , 2024 | 06:31 PM

ఏప్రిల్ మొదటివారంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) స్పష్టం చేశారు. ఆదివారం నాడు బీజేపీ విజయ సంకల్ప యాత్ర తూప్రాన్‌ చేరుకుంది. ఈ యాత్రలో కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలవకున్న నష్టం లేదని చెప్పారు.

మెదక్: ఏప్రిల్ మొదటివారంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) స్పష్టం చేశారు. ఆదివారం నాడు బీజేపీ విజయ సంకల్ప యాత్ర తూప్రాన్‌ చేరుకుంది. ఈ యాత్రలో కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలవకున్న నష్టం లేదని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు అని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంపీ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని విరుచుకుపడ్డారు.

రేవంత్‌కు ఆ సత్తా లేదు..

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17కి 17 సీట్లు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ను రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్లిపోతారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేరని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకి ఓటేస్తే వృథా అయినట్టేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే సత్తా సీఎం రేవంత్ రెడ్డికి లేదని చెప్పారు. ఇంకో రెండు నెలలు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నాయకులను గ్రామాల్లో తిరగనీయబోమని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

Updated Date - Feb 25 , 2024 | 11:12 PM

Advertising
Advertising