ABN Effect: ఎంపీ అవినాష్ రెడ్డి బాధితుడికి కూటమి ప్రభుత్వం న్యాయం..
ABN, Publish Date - Dec 01 , 2024 | 09:09 AM
పులివెందుల వైసీపీ నాయకుల చెరలో ఉన్న ఆరు కార్లు యజమానికి చేరాయి. సంగారెడ్డికి చెందిన హరహర రెంటల్ కార్ ట్రావెల్స్ యజమాని సతీష్ కుమార్.. వికారాబాద్‌కు చెందిన మణిరాజ్‌కు 2021లో ఆరు కార్లు అద్దెకిచ్చాడు. మణిరాజ్ నుంచి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు ఆరు కార్లను లీజ్‌కు తీసుకుని పులివెందులకు తీసుకువెళ్లి అక్కడే ఉంచుకున్నారు.
అమరావతి: గత పాలనలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు (YSRCP Leaders) దెబ్బకు దిగొస్తున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) బాధితుడికి (Victim) కూటమి ప్రభుత్వం (Kutami Govt.,) చొరవతో ఎట్టకేలకు న్యాయం జరిగింది. కార్ల వ్యవహారంలో పులివెందుల (Pulivendula) వైసీపీ నేతలు దిగివచ్చారు. పులివెందుల వైసీపీ నాయకుల చెరలో ఉన్న కార్లను యజమానికి చేరాయి. సంగారెడ్డిలోని హరహర ట్రావెల్స్ యజమానికి చెందిన ఆరు కార్లను 2021లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు లీజుకు తీసుకున్నారు. 2022లో తన కార్లను వెనక్కి ఇవ్వాలని యాజమాని సతీష్ కోరగా అతడిని బంధించి చిత్రహింసలు పెట్టారు. ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుల చెర నుంచి తప్పించుకుని బాధితుడు సతీష్ ఇటీవల కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో కడప జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. వైసీపీ నేతల దగ్గర ఉన్న ఆరు కార్లను గుర్తించి తెలంగాణ పోలీసులకు అప్పగించారు.
సంగారెడ్డికి చెందిన హరహర రెంటల్ ట్రావెల్స్ యజమాని సతీష్ కుమార్ వికారాబాద్‌కు చెందిన మణిరాజ్‌కు 2021లో ఆరు కార్లు అద్దెకిచ్చాడు. మణిరాజ్ నుంచి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు ఆరు కార్లను లీజ్‌కు తీసుకుని పులివెందులకు తీసుకెళ్లి అక్కడే ఉంచుకున్నారు. అయితే కార్లకు సంబంధించి అద్దె చెల్లించకపోవడంతో పాటు.. తిరిగి కార్లను ఇవ్వకపోవడంతో గత ఏడాది సంగారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు సతీష్ ఫిర్యాదు చేశాడు. కార్లు పులివెందులలో ఉన్నట్లు గుర్తించిన సతీష్.. అక్కడి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
అయితే ఏపీలో ప్రభుత్వం మారడంతో ఇటీవల కూటమి నేతలను కలిసి సతీష్ కుమార్ తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశాడు. దీంతో వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించింది. కూటమి ప్రభుత్వం ఆదేశాలతో రంగంలోకి దిగిన వైఎస్సార్ జిల్లా పోలీసులు వైసీపీ నాయకుల దగ్గర ఉన్న ఆరు కార్లను బాధితుడు సతీష్ కుమార్ గుర్తించడంతో ఆయన సమక్షంలో తెలంగాణ పోలీసులకు అప్పగించారు. అయితే తన పేరు మీద ఉన్న ఆరు కార్లతో ఒక కారును వారి పేరిట అక్రమంగా మార్చుకున్నారని, నెంబర్ ప్లేట్‌ను మార్చేశారని.. అంతేకాకుండా తనను చంపేందుకు ప్రయత్నించారని సతీష్ కుమార్ వాపోయాడు.
మరోవైపు బాధితుడికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అండగా నిలిచింది. డిబేట్‌లో బాధితుడికి జరిగిన అన్యాయంపై గళమెత్తారు. ఏ మాత్రం భయపడొద్దని ‘మీకు మేమున్నామని’ భరోసా ఇచ్చారు. కూటమి నేతలకు ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోనే చర్య తీసుకున్నారని అన్నారు. తన కార్లు తనకు తిరిగి వచ్చాయని సతీష్ కుమార్ అన్నాడు. కార్లను ఇప్చించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు సతీష్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్టెల్లా షిప్‌కు నో డ్యూ సర్టిఫికెట్‌కు నిరాకరణ
లంగర్‌హౌస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 01 , 2024 | 09:09 AM