ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Jupally: కేసీఆర్ చేసిన అప్పుకు ప్రతినెలా రూ.5వేల కోట్లు వడ్డీ కడుతున్నాం..

ABN, Publish Date - Jul 20 , 2024 | 08:46 PM

తెలంగాణలో రైతు రుణమాఫీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, రైతులు సంబరాలు చేసుకుంటున్నారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లుగా చేయలేని పనిని తాము చేసి చూపించామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా భిక్కనూరులో నిర్వహించిన రుణమాఫీ సంబరాల్లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు.

Minister Jupally Krishna Rao

కామారెడ్డి: తెలంగాణలో రైతు రుణమాఫీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, రైతులు సంబరాలు చేసుకుంటున్నారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లుగా చేయలేని పనిని తాము చేసి చూపించామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా భిక్కనూరులో నిర్వహించిన రుణమాఫీ సంబరాల్లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.." మొదటి విడతలో భాగంగా 11.5లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చాం. రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేసేందుకు ఇప్పటికే రూ.6,098కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. రెండో విడతలో భాగంగా రూ.లక్షన్నర మాఫీ ఈనెల చివరి కల్లా చేస్తాం. ఆగస్టు నెల దాటక ముందే రూ.2లక్షల మాఫీ అమలు చేస్తాం. అన్నదాతల భవిష్యత్తు కోసం మొత్తం రూ.31వేల కోట్లు ఖర్చు చేయనున్నాం. రాష్ట్రం సంక్లిష్టమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ఎన్నికల హామీ మేరకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు ఇచ్చిన హామీ సైతం నిలబెట్టుకున్నాం. రైతన్నలు పంటలు వేసే సరైన సమయంలో వారి రుణాలు మాఫీ చేశాం. అందుకు వారెంతో సంతోషంగా ఉన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6నెలల కాలం శాసనసభ సమావేశాలు, ఎన్నికల కోడ్‌కే సరిపోయింది. మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతికి ప్రభుత్వం వచ్చినప్పుడు తెలంగాణ అప్పు రూ.70వేల కోట్లు. కేసీఆర్ పాలించిన 10ఏళ్ల కాలంలో ఆయన చేసిన రుణాలు రూ.7లక్షల కోట్లు. ఆయన చేసిన అప్పులకు ప్రస్తుతం ప్రతి నెల రూ.5వేల కోట్లు వడ్డీగా కడుతున్నాం. కేసీఆర్ హయాంలో ఆర్థిక శాఖ ద్వారా చెల్లించాల్సిన బకాయిలే రూ.40వేల కోట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి తెలంగాణ ధనిక రాష్ట్రం. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి వెళ్లిపోయారు. వీటన్నింటిని తీర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై పడింది. అప్పులను తీరుస్తూనే రైతులకు మేలు చేసేలా రుణమాఫీ చేశామని" చెప్పారు.

Updated Date - Jul 20 , 2024 | 08:46 PM

Advertising
Advertising
<