BJP Bandh: మెదక్‌లో జంతువధ ఘర్షణల నేపథ్యంలో కొనసాగుతున్న బంద్..
ABN, Publish Date - Jun 16 , 2024 | 11:41 AM
మెదక్ పట్టణం(Medak Town)లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. శనివారం జంతువధ(Animal Slaughter) విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ ఏర్పడడంతో ఇవాళ(ఆదివారం) బీజేపీ బంద్(BJP bandh)కు పిలుపునిచ్చింది. వర్తక, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి.
మెదక్:పట్టణం(Medak Town)లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. శనివారం జంతువధ(Animal Slaughter) విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ ఏర్పడడంతో ఇవాళ(ఆదివారం) బీజేపీ బంద్(BJP bandh)కు పిలుపునిచ్చింది. వర్తక, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఘర్షణల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. గొడవలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
బక్రీద్ పండగ సందర్భంగా మెదక్ పట్టణంలో జంతువధ నిషేధించాలంటూ నిన్న (శనివారం) మధ్యాహ్నం ఓ వర్గం వారు నిరసనకు దిగారు. పట్టణంలోని బంగ్లా చెరువు వద్ద ఆవులు కనిపించడంతో వాటిని వధించేందుకు తెచ్చారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంగ్లా చెరువు వద్ద ఉన్న గోవులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సిఖేడ్‌లోనూ ఆవులు ఉన్నాయన్న సమాచారంతో సీఐ అక్కడికి చేరుకుంటున్న సమయంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తి మరోవర్గం యువకుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
దీంతో ఇరువర్గాలు పెద్దఎత్తున రాళ్ల దాడికి దిగడంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఘర్షణ నేపథ్యంలో ఆందోళన కారులు ఓ ప్రైవేటు ఆస్పత్రి అద్దాలు, కారు ధ్వసం చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరకొట్టారు. పట్టణంలో దుకాణాలు మూసివేయించి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి:
Crime news: నర్సాపూర్ జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు.. నిందుతుడు ఎవరంటే?
Updated Date - Jun 16 , 2024 | 11:45 AM