Telangana: నెహ్రూ కట్టడాలు చేపడితే.. మోదీ అమ్మకాలు చేపడుతున్నారు: జగ్గారెడ్డి
ABN, Publish Date - May 27 , 2024 | 07:08 PM
ప్రధాని మోదీ పాలనా విధానాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jaggareddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. నెహ్రూ(Nehru) దేశం కోసం, దేశ భవిష్యత్ కోసం అనేక నిర్మాణాలు, కట్టడాలు చేపడితే.. ఇప్పుడు మోదీ(PM Modi) వాటన్నింటి అమ్మకాలు చేపడుతున్నారని విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన..
సంగారెడ్డి, మే 27: ప్రధాని మోదీ పాలనా విధానాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jaggareddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. నెహ్రూ(Nehru) దేశం కోసం, దేశ భవిష్యత్ కోసం అనేక నిర్మాణాలు, కట్టడాలు చేపడితే.. ఇప్పుడు మోదీ(PM Modi) వాటన్నింటి అమ్మకాలు చేపడుతున్నారని విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నెహ్రూ ప్రధాని అయినప్పుడు దేశంలో కరెంట్ లేదని.. ప్రాజెక్టులు కూడా లేవని అన్నారు. దేశంలో ప్రాజెక్టులు కట్టి వ్యవసాయం, విద్యుత్‌ని తీసుకువచ్చింది నెహ్రూ అని తెలిపారు. ఎఫ్‌సిఐ ఏర్పాటు చేసి దేశాన్ని ఆకలి చావుల నుంచి కాపాడింది నెహ్రూ అని పేర్కొన్నారు. ప్రధానిగా మోదీ ఈ పదేళ్లలో కనీసం ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా? అని ప్రశ్నించారు.
ఆస్తులు పోగు చేసింది కాంగ్రెస్ అయితే.. ఆస్తులు ధారాదత్తం చేస్తుంది మాత్రం మోదీ అని జగ్గారెడ్డి విమర్శించారు. నెహ్రూ ప్రాజెక్టులు కట్టే పని పెట్టుకున్నారని.. అందులో భాగంగానే తెలంగాణలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను నిర్మించారని పేర్కొన్నారు. నెహ్రూ దూరదృష్టితోనే ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. పారిశ్రామిక రంగాన్ని కూడా నెహ్రూ ప్రోత్సహించారని జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రాజెక్టులు కట్టలేదని ఎవరైనా చెప్పగలరా? విశాఖ ఉక్కు తెచ్చింది తామేనని.. అమ్మకానికి పెట్టింది మాత్రం మోదీ అని విమర్శించారు. బీజేపీలో పదవులు అడిగితే ఉన్న పదవి పోతుందని.. బీఆర్ఎస్‌లో పదవి అడిగే పరిస్థితే ఉండదన్నారు. కాంగ్రెస్‌లో మాత్రం అలా ఉండదన్నారు జగ్గారెడ్డి. ఎవరైనా సరే పదవులు అడిగే పరిస్థితి ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు.
For More Telangana News and Telugu News..
Updated Date - May 27 , 2024 | 07:08 PM