Congress: సీడబ్ల్యూసీ నేతల భేటీ రేపు.. తెలంగాణ ఎంపీ సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం
ABN, Publish Date - Mar 18 , 2024 | 09:48 PM
కాంగ్రెస్(Congress) వర్కింగ్ కమిటీ రేపు(మంగళవారం) సమావేశం కానున్నది. ఉదయం 10.00 గంటలకు సీడబ్ల్యూసీ నేతలు భేటీ కానున్నారు. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేయనున్నారు. ఐదు న్యాయాల పేరుతో కాంగ్రెస్ ప్రజల ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
ఢిల్లీ: కాంగ్రెస్(Congress) వర్కింగ్ కమిటీ రేపు(మంగళవారం) సమావేశం కానున్నది. ఉదయం 10.00 గంటలకు సీడబ్ల్యూసీ నేతలు భేటీ కానున్నారు. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేయనున్నారు. ఐదు న్యాయాల పేరుతో కాంగ్రెస్ ప్రజల ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ పేరుతో మేనిఫెస్టోను ప్రకటించనున్నది. ప్రతి విభాగంలో ఐదు గ్యారంటీ, మొత్తంగా 25 గ్యారంటీలు ఉండనున్నాయి.
సాయంత్రం 4.00 గంటలకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లోని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నది. తెలంగాణలో మిగతా 13 ఎంపీ సీట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే అధిష్ఠానానికి సీఎం రేవంత్‌రెడ్డి ఓ జాబితాను పంపించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా రెండు జాబితాల్లో 82 మంది పేర్లను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 18 , 2024 | 09:49 PM